ఏపీలో లక్ష్మీస్ ఎన్టీఆర్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది.. ఎప్పుడంటే?

-

లక్ష్మీస్ ఎన్టీఆర్.. రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా లక్ష్మీ పార్వతి.. ఎన్టీఆర్ జీవితంలోకి వచ్చాక… ఎన్టీఆర్ పరిస్థితులు ఎలా మారాయి. ఎన్టీఆర్ పదవీచ్యుతుడు ఎలా అయ్యాడు. చంద్రబాబు.. ఎన్టీఆర్ ను ఎలా వెన్నుపోటు పొడిచాడు.. అన్న కథాంశంతో తెరకెక్కింది. అయితే.. ఈ సినిమా తెలంగాణలో ఇదివరకే రిలీజ్ అయింది. హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే.. ఏపీలో మాత్రం రిలీజ్ కాలేదు. ఎన్నికలు ఉన్నాయని ఆ సినిమా విడుదలను ఆపేశారు.

సో.. ఇప్పుడు ఎన్నికలు ముగియడం, ఏపీలో వైఎస్ జగన్ బ్రహ్మాండమైన మెజారిటీతో గెలవడంతో… లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదలకు లైన్ క్లియర్ అయింది.

చంద్రబాబు ప్రభుత్వం కావాలని లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాను విడుదల చేయనీయలేదు. అప్పట్లో వర్మ కూడా ట్విట్టర్ వేదికగా.. చంద్రబాబు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏది ఏమైనా ఆ సినిమా రిలీజ్ కు ఉన్న అడ్డంకులన్నీ ఇప్పుడు తొలగిపోయాయి.

లక్ష్మీస్ ఎన్టీఆర్ విడుదల మే 31న ఉంటుందట. మే 30న వైఎస్ జగన్ ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత మే 31న ఏపీలో సినిమాను రిలీజ్ చేస్తున్నామని వర్మ ట్వీట్ చేశారు.

అంతే కాదు.. ఇవాళ విజయవాడలో వర్మ నిర్వహించే ప్రెస్ మీట్ కూడా సాయంత్రం 4 గంటలకు ఫిలిం చాంబర్ లో ఉంటుందని వర్మ ట్వీట్ చేశారు. ముంబై నుంచి స్పైస్ జెట్ విమానంలో మధ్యాహ్నం 1 గంటకు తాను విజయవాడ వస్తున్నానని.. చంద్రబాబు పోలీసుల్లా కాకుండా.. జగన్ పోలీసులు తమతో మర్యాదగా వ్యవహరిస్తారని ఆశిస్తున్నా.. అంటూ మరో బాంబు పేల్చారు వర్మ.

Read more RELATED
Recommended to you

Exit mobile version