కరోనాతో ప్రముఖ నటుడు వేణుగోపాల్‌ మృతి

-

కరోనా వైర‌స్‌ మరో నటుడిని బ‌లితీసుకుంది. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్ ఈ మహమ్మారి బారిన పడగా.. చికిత్స పొందుతూ కన్ను మూశారు. గత 22 రోజులుగా ఆయన గచ్చిబౌలిలోని ప్రముఖ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. గత నెలలో ఆయనకు కరోనా సోకింది. బుధవారం ఆరోగ్య పరిస్థితి మ‌రింత‌గా క్షీణించడంతో బుధవారం మృతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురానికి చెందిన వేణుగోపాల్‌ ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. మర్యాద రామన్న, విక్రమార్కుడు, ఛలో, పిల్ల జమిందార్‌ తదితర సినిమాలతో పాటు పలు సీరియళ్లలోనూ ఆయ‌న న‌టించారు.

ఆఖరుగా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అమీతుమీ సినిమాలో కనిపించారు. అనేక సినిమాల్లో త‌న‌దైన న‌ట‌న‌తో మంచి గుర్తింపు పొందారు. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ మంచి నటుడిని కోల్పోయిందంటూ అనేక మంది తమ సంతాపం ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news