ప్రిన్స్ మహేష్ బాబు గా .. కృష్ణ వారసుడిగా ఇండస్ట్రీ లోకి బాలనటుడిగా అడుగుపెట్టిన మహేష్ బాబు అనతికాలంలోనే సూపర్ స్టార్ హీరో గా చలామణి అవుతున్నారు. కేవలం తెలుగు సినిమాలకు మాత్రమే పరిమితం అయ్యి కొన్ని వేల కోట్ల ఆస్తులను కూడబెట్టారు. మహేష్ బాబు కేవలం హీరోగా మాత్రమే కాకుండా రియల్ ఎస్టేట్.. పలు మల్టీప్లెక్స్ థియేటర్ లతోపాటు ప్రముఖ బ్రాండ్ ఉత్పత్తులకు బ్రాండ్ అంబాసిడర్గా కూడా వ్యవహరిస్తూ కొన్ని వందల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అంతే కాదు ఈయన భార్య అలాగే ప్రముఖ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న నమ్రత కూడా మహేష్ బాబు ఇంటికి వర కట్నం కింద కొన్ని వేల కోట్లు తీసుకొచ్చింది అని సమాచారం. మొత్తంగా చూసుకుంటే మహేష్ బాబు ఎన్ని వేల కోట్లకు ఆస్తిపరుడు అనే విషయం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.అన్ని కమర్షియల్ చిత్రాలు చేస్తూ సూపర్ స్టార్ గా ఎదిగిన మహేష్ బాబు మహర్షి సినిమా కోసం ఏకంగా 25 కోట్ల రూపాయలు పారితోషికంగా అందుకున్నారు. నమ్రత ఏకంగా రూ.2,500 కోట్ల రూపాయలను కట్నం కింద మహేష్ బాబు ఇంటికి తీసుకు వచ్చింది. నమ్రత వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టిందో లేదో మహేష్ బాబు సినీ కెరీర్లో వరుస విజయాలు కమర్షియల్ కలెక్షన్లు అంటూ నిర్మాతలకు కూడా విజయ లాభాలు వచ్చాయి. నమ్రత తన కుటుంబం నుంచి 2,500 కోట్ల రూపాయలతో పాటు కొన్ని అప్పులు కూడా తీసుకు వచ్చినట్లు సమాచారం. ఇక యాడ్స్ ద్వారా ప్రతి సంవత్సరం 180 కోట్ల రూపాయలను మహేష్ బాబు ఆర్జిస్తున్నారు.శ్రీమంతుడు సినిమా నుంచి నిర్మాతగా కూడా గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు నెట్ఫ్లిక్స్, మల్టీప్లెక్స్ అంటూ వెబ్ సిరీస్ లను కూడా నిర్మిస్తూ భారీగా డబ్బులు పోగు చేసుకున్నారు మహేష్ బాబు. ఇక 80 కోట్ల రూపాయల విలువ చేసే ఇంటిలో మహేష్ బాబు నివసిస్తున్నాడు. మరొక ఇల్లు కూడా హైదరాబాద్ లోనే ఉంది. కోట్ల రూపాయల విలువ చేసే రెండు ఇల్లులు ఉన్నాయి. షూటింగ్ లో మహేష్ బాబు ఉపయోగించే కేరవాన్ విలువ రూ. 35 కోట్లు . రేంజ్ రోవర్ , బెంజ్, స్కోడా వంటి కార్లు ఇద్దరి దగ్గర ఒక్కొక్కటి ఉన్నట్లు సమాచారం. బంగారం , వెండి, ప్లాటినం పది కేజీల పైగానే ఉంటుందట. ఇక మొత్తంగా చూసుకుంటే సుమారుగా రూ. 12 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు సమాచారం.