విలేకరులపై మంత్రి అంబటి వివాదాస్పద వ్యాఖ్యలు..

-

ఏపీ జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విలేకరులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇటీవల.. వైసీపీ కార్యాలయంలో మంత్రి మీడియా సమావేశం ఉందంటూ కొందరు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు సమాచారం వచ్చింది. అయితే ఈ నేపథ్యంలో.. మంత్రికి బదులుగా వైసీపీ నియోజకవర్గ నేతలతోనే సమావేశాన్ని ముగించారు. అయితే.. చాంబర్‌లోనే ఉన్న అంబటి సమావేశం ముగిశాక విలేకరులను పిలిచి మాట్లాడారు. తన పనితీరు ఎలా ఉందో చెప్పాలని విలేకరులను ప్రశ్నించారు.

YSRCP is 'Gita, Quran, Bible' party: Ambati Rambabu - Sentinelassam

ఈ క్రమంలో పోలవరం ప్రాజెక్టులో కొండపోరంబోకు భూముల పరిహారాన్ని అధికారులు బినామీ పేర్లతో పక్కదారి పట్టిస్తున్నారంటూ ఓ ప్రముఖ దినపత్రికలో కథనం వచ్చింది. ఈ కథనాన్ని ప్రస్తావించిన మంత్రి ఈ ఘటనపై విచారణ చేయిస్తామని అన్నారు. అనంతరం, ఈ సమావేశానికి తమ పార్టీ వ్యతిరేక మీడియాకు చెందిన విలేకరులు ఎవరైనా వచ్చారా? అని కొన్ని మీడియా సంస్థల పేర్లు చెప్పి ప్రశ్నించారు. రాలేదని వారు చెప్పగానే మంత్రి స్పందిస్తూ.. ‘‘ఏం లేదు, వస్తే తిట్టి పంపుదామని’’ అంటూ మంత్రి అంబటి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి.

Read more RELATED
Recommended to you

Latest news