ప్ర‌భాస్ కోసం లెజెండ‌రీ డైరెక్ట‌ర్‌!

-

ప్ర‌భాస్ సినిమాల ఎంపిక విష‌యంలో స్పీడు పెంచారు. వ‌రుస‌గా రెండు భారీ ప్రాజెక్ట్‌ల‌ని లైన్‌లో పెట్టారు. `రాధేశ్యామ్‌` మూవీలో న‌‌టిస్తున్న ప్ర‌భాస్ ఈ మూవీతో పాటు నాగ్ అశ్విన్‌తో ఓ మూవీ, బాలీవుడ్ డైరెక్ట‌ర్ ఓం రౌత్‌తో ఓ మూవీ అంగీక‌రించిన విష‌యం తెలిసిందే. ఈ రెండు చిత్రాల‌కు సంబంధించిన ప్రీ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్ ప్ర‌స్తుతం ఫుల్ స్వింగ్‌లో జ‌రుగుతోంది. నాగ్ అశ్విన్ చిత్రంలో ప్ర‌భాస్‌కి జోడీగా దీపికా ప‌దుకునే హీరోయిన్ గా న‌టిస్తోంది.

వైజ‌యంతీ మూవీస్ 50వ వ‌సంతంలోకి ఎంట‌ర‌వుతున్న సంద‌ర్భంగా ఈ చిత్రాన్ని అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించాల‌ని ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి తాజాగా ఓ వార్త బ‌య‌టికి వ‌చ్చింది. సైన్స్ ఫిక్ష‌న్‌గా తెర‌కెక్కునున్న ఈ చిత్రానికి ప్ర‌ముఖ వెట‌ర‌న్ డైరెక్ట‌ర్ సింగీతం శ్రీ‌నివాస‌రావు ఓ కీల‌క పాత్ర‌ని పోషించ‌బోతున్న‌ట్టు తెలిసింది.

సోమ‌వారం ఆయ‌న పుట్టిన రోజు కావ‌డంతో వైజయంతీ మూవీస్ సంస్థ బ‌ర్త్‌డే విషెస్ తెలియ‌జేస్తూ ఓ పోస్ట‌ర్‌ని రిలీజ్ చేసి హింట్ ఇచ్చేసింది. సైన్స్ ఫిక్ష‌న్‌గా రూపొంద‌నున్న ఈ చిత్రానికి ఆయ‌న మెంట‌ర్‌గా ప‌నిచేయ‌బోతున్నార‌ని, ఆయ‌న సూప‌ర్‌ప‌వ‌ర్స్ ఈ చిత్రానికి గైడింగ్ ఫోర్స్‌లా వుండ‌బోతున్నాయ‌ని చిత్ర బృందం ప్ర‌క‌టించ‌డం విశేషం.

Read more RELATED
Recommended to you

Latest news