సైలెంట్​గా ఓటీటీలోకి వచ్చేసిన ధోని మూవీ LGM

-

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్.. మిస్టర్ కూల్ మహేంద్ర సింగ్ ధోని తన సతీమణి సాక్షితో కలిసి ధోనీ ఎంటర్‌టైన్‌ మెంట్‌ బ్యానర్‌ మొదలు పెట్టిన విషయం తెలిసిందే. అయితే ఈ బ్యానర్​లో ధోని.. తన పుట్టిల్లులా భావించే చెన్నై వాసులకు కానుకగా తన తొలిసినిమాను తమిళంలోనే నిర్మించారు. అలా ఈ బ్యానర్ నుంచి వచ్చిన తొలి చిత్రం ఎల్​జీఎం(Lets Get Married). ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన‌ ఈ చిత్రంలో హరీశ్ కల్యాణ్‌ హీరోగా నటించగా.. లవ్‌టుడే ఫేం ఇవానా హీరోయిన్​గా కనిపించింది.

రమేశ్‌ తమిళ్‌మని డైరెక్షన్​లో తెరకెక్కిన ఈ సినిమా జులై 28న విడుదలైన ప్రేక్షకుల్లో మంచి టాక్ సంపాదించుకుంది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబట్టింది. అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది. సైలెంట్​గా ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్​ వీడియోస్​లో స్ట్రీమింగ్ అవుతోంది. అయితే ట్విస్ట్ ఏంటంటే.. ఇది కేవలం తమిళ్ వెర్షన్​లో మాత్రమే అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే తెలుగు ఇంకా ఇతర భాషల్లోకి రానున్నట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news