జీవితం మొత్తం కష్టాల మయం – మనీషా కొయిరాలా..!

-

ప్రముఖ బ్యూటీ మనీషా కొయిరాల గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. బొంబాయి , క్రిమినల్, భారతీయుడు ,ఒకే ఒక్కడు వంటి చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులను అలరించిన మనీషా కొయిరాలా చాలా కాలం తర్వాత మళ్లీ బాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాలలో నటిస్తూ మెప్పించింది. అంతేకాకుండా ఈమధ్య కంపెనీ , లస్ట్ స్టోరీస్, దిల్ సే వంటి హిందీ చిత్రాలలో కూడా నటించిన ఈమె ఇవాళ తన 53 వ పుట్టినరోజు సందర్భంగా తన కెరీర్లో ఎదుర్కొన్న కష్టాల గురించి వెల్లడించింది.

1976 ఆగస్టు 16న నేపాల్ లో జన్మించిన ఈమె పాఠశాలలో చదువుతుండగానే 1989 లో ఫేరి భేతౌలా అనే నేపాల్ చిత్రంలో మొదటిసారి కనిపించింది. చిన్నప్పటినుంచి డాక్టర్ కావాలనుకున్న ఈమె మొదట మోడల్ గా పనిచేసే 1991లో వచ్చిన హిందీ సినిమా సౌధాగర్ తో బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది.. నేపాల్ కుటుంబం రాజకీయ నేపథ్యంలో ఉన్న ఇంటి నుంచి వచ్చిన మనీషా తన సినిమాలతో నాలుగు ఫిలింఫేర్ అవార్డులను అలాగే నేపాల్ రాజ ప్రభుత్వం అందించే రెండో అత్యున్నత పురస్కారాన్ని కూడా సొంతం చేసుకుంది.

ఇక నేపాల్ కి చెందిన వ్యాపారవేత్త సామ్రాట్ దహల్ తో 2010లో ఏడడుగులు వేసిన ఈమె పెళ్లయిన ఆరు నెలలకే విభేదాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. ఇకపోతే చాలా కాలం తర్వాత పెళ్లి గురించి మాట్లాడిన ఈమె.. పెళ్లయిన తర్వాత ఎన్నో కలలు కన్నాను . కానీ ఆరు నెలలకే గొడవలు ప్రారంభమై ప్రేమించిన భర్తే శత్రువుగా మారాడు. నేను మాత్రమే కాదు మీరు మీ పెళ్లి బంధంలో సంతోషంగా లేకుంటే విడిపోవడమే మంచిది. ఇకపోతే కుటుంబ సభ్యులు, స్నేహితులతో తన జీవితం సంపూర్ణమైందని , అయితే భర్త కూడా ఉండి ఉంటే ఆ జీవితం మరోలా ఉండేదేమో చెప్పలేనని కూడా తెలిపింది. ఇక భర్తతో విడిపోయినప్పుడు క్యాన్సర్ బారిన పడి తిరిగి కోలుకున్న విషయం తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news