సోనీలివ్‌ యూజర్స్​కు అలర్ట్.. OTT నుంచి Live TV ఛానెల్స్‌ కట్‌

-

ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీలివ్‌ కీలక నిర్ణయం తీసుకుంది. సోనీలివ్ ఓటీటీలో కీలక మార్పు చేయబోతోంది. త్వరలో ఓటీటీ ప్లాట్‌ఫాం నుంచి సోనీ లైవ్‌ టీవీ ఛానెళ్లను తొలగించాలని నిర్ణయించింది. ఆగస్టు 30 నుంచి ఈ మార్పులు తీసుకురానున్నట్లు తెలిసింది. ప్రస్తుతానికి సోనీలివ్‌ ఓటీటీ యాప్‌లో సినిమాలు, వెబ్‌ సిరీస్‌లతో పాటు లైవ్‌ ఛానెళ్లనూ వీక్షించే సదుపాయం ఉంది. ఇకపై ఆ జాబితా నుంచి లైవ్‌ ఛానెళ్లు కనుమరుగుకానున్నాయి.

సోనీ ఛానెళ్లలో వచ్చే సినిమాలు, ఇతర ప్రోగ్రాములు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని.. ఆ మేరకు సోనీలివ్‌ సబ్‌స్క్రైబర్లకు సందేశాలు పంపుతోంది. తన టర్మ్‌ ఆఫ్‌ యూజ్‌ పాలసీలో మార్పులు చేస్తోంది. లైవ్‌ టీవీ ఛానెళ్లను తొలగించడానికి గల కారణమేంటన్నది మాత్రం సోనీ వెల్లడించలేదు. సోనీలివ్‌లో ప్రస్తుతం సోనీ టీవీ, SAB TV, సోనీ మరాఠి, సోనీ మ్యాక్స్‌, బీబీసీ ఎర్త్‌తో పాటు సోనీ ఎంటర్‌టైన్‌మెంట్‌ టెలివిజన్‌ (ఇండియా) ఆధ్వర్యంలో నడుస్తున్న పలు స్పోర్ట్స్‌ ఛానెళ్లను ఓటీటీ వేదికగా ప్రసారం చేస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news