మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆచార్య టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. దేవదాయ ధర్మదాయ శాఖలో జరుగుతున్న అక్రమాల నేపథ్యంలో ఈ సినిమాని కొరటాల తెరకెక్కిస్తున్నారు. అయితే ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా పూర్తిగా ఇంటికే పరిమితం అయ్యారురు చిరంజీవి. లాక్ డౌన్ కు ముందే తన ఆచార్య షూటింగ్ ను క్యాన్సిల్ చేసుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ తో పూర్తిగా ఇంట్లోనే ఉంటు సామాజిక బాధ్యతతో అందరికి సలహాలిస్తూ చైతన్యం నిపుతూ స్పూర్తిగా నిలుస్తున్నారు. ఇక తాజాగా ఉగాది పండగను పురస్కరించుకొని సోషల్ మీడియాలో ఎంటర్ అయిన మెగాస్టార్ వరుసగా ట్వీట్స్.. పోస్ట్ లు పెడుతూ అబిమానులను పలకరిస్తున్నారు.
మెగాస్టార్ చిరంజీవి కేవలం ఇంట్లో వారితో గడపడమే కాకుండా మొక్కలకు నీళ్లు పోయడం వంటివి చేస్తున్నారు. ప్రతి రోజు ఉదయం మొక్కలకు నీళ్లు పోస్తానంటూ చిరంజీవి తెలిపారు. ఈ ఫొటోను చిరంజీవి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. దీంతో పాటు మొక్కే కదా అని వదిలేస్తే… అంటూ తన ఇంద్ర సినిమాలోని డైలాగ్ ని కూడా పోస్ట్ చేశాడు. ఈ రకంగా చిరంజీవి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు.
ట్విట్టర్ ఇన్ స్టాగ్రామ్ లోనే కాదు ఇంట్లో పనులని చక్కబెడుతున్నారట. ఇక రీసెంట్ గా ట్విట్టర్ లోకి ఎంటరయిన చిరంజీవి పూరి జగన్నాధ్ తో ఆసక్తికరమైన చర్చ జరిపారు. ఇది ఫ్యాన్స్ లో ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఇక ఈ రోజు మెగాస్టార్ తనయుడు మెగా పవర్ స్టార్ రాం చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చరణ్ కి చిరంజీవి స్పెషల్ గిఫ్ట్ కూడా ఇచ్చారట. మొత్తానికి కరోనా ఎఫెక్ట్ తో సామాన్యుల దగ్గర్నుంచి సెలబ్రిటీస్ వరకు అందరూ చాలా ప్రశాంతంగా ఇంట్లో వాళ్ళతో గడుపుతున్నారు.