శ్రుతి హాసన్ తో లోకేశ్ కనగరాజ్ రొమాన్స్.. షాక్లో ఫ్యాన్స్

-

ఖైదీ’ ‘విక్రమ్‌’ లాంటి చిత్రాలతో కోలీవుడ్లో స్టార్‌ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు లోకేశ్‌ కనగరాజ్‌. ఇన్నాళ్లూ మెగా ఫోన్ పట్టి కెమెరా వెనక ఉన్న ఆయన ఇప్పుడు నటుడిగా తన సత్తా చాటేందుకు సిద్ధమయ్యాడు. కోలీవుడ్ బ్యూటీ శ్రుతి హాసన్‌తో కలిసి లోకేశ్ నటించనున్నాడు. అయితే ఇది సినిమా కోసం కాదండోయ్. ఓ స్పెషల్ సాంగ్ కోసం ఈ ఇద్దరూ కలిసి వర్క్ చేశారు.

‘ఇనిమేల్’ అంటూ సాగే ఈ పాట ప్రోమో తాజాగా విడుదలైంది. ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్కు గురయ్యారు. వీరి కెమిస్ట్రీ చూసి ఫిదా అవుతున్నారు. ‘‘ఇది మా దర్శకుడు లోకేశ్‌ కనగరాజేనా..?’’, ‘‘రొమాంటిక్‌ సీన్స్‌ రాయడంలో పెద్దగా నాలెడ్జ్‌ లేదని చెప్పిన ఆయనేనా ఈయన..?’’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ పాటకు కమల్‌హాసన్‌ లిరిక్స్ అందించగా.. ద్వారకేశ్‌ ప్రభాకర్‌ దర్శకత్వం వహించారు. మార్చి 25న ఫుల్‌ వీడియో సాంగ్‌ విడుదల చేయనున్నారు. గతేడాది ‘లియో’తో ప్రేక్షకులను అలరించిన లోకేశ్‌ కనగరాజ్‌.. ప్రస్తుతం తదుపరి సినిమా స్క్రిప్ట్‌ పనుల్లో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news