Lopaliki ra cheptha Review : ‘లోప‌లికి రా చెప్తా’ – నవ్వులే నవ్వులు

-

కొండా వెంకట రాజేంద్ర, మనీషా, సుస్మిత, సాంచిరాయి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా లోపలికి రా చెప్తా. హారర్ అలాగే కామెడీ నేపథ్యంలో ఈ సినిమా తెరపైకి ఎక్కింది. ఈ సినిమాకు వెంకట రాజేంద్ర దర్శకత్వం వహించారు. ఇవాళ రిలీజ్ అయిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ మరియు విశ్లేషణ

లోపలికి రా చెప్తా అనే సినిమా.. పూర్తిగా హారర్ అలాగే కామెడీ నేపథ్యంలో వచ్చింది. ఈ సినిమా కథ విషయాల్లోకి వెళితే… డెలివరీ బాయ్ రామ్, ప్రియా లకు పెళ్లి జరుగుతుంది. ఇక శోభనం రోజు గదిలోకి వెళ్లిన తర్వాత ప్రియా దయ్యంలా మారిపోయి రామును భయపట్టిస్తుంది. దీంతో స్నేహితుడు ఇచ్చిన సలహాతో చేతికి తాయత్తు కట్టుకుంటాడు రామ్. ఇక రెండో రోజు రాత్రి కూడా అలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఈ నేపథ్యంలో మంత్రగాడి పాత్రలో ఉన్న వంశీ దగ్గరికి వెళ్తారు. ఇక ఆ తర్వాత ఆ మంత్రగాడు ఏం చేస్తాడు… నిజంగానే దయ్యం పట్టిందా…? లేకపోతే ప్రియా నాటకాలు ఆడిందా అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఈ కథలో దర్శకుడు కం హీరో రాజేంద్ర ఫన్ జోనర్ అదిరిపోయింది. రొమాంటిక్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ ని కూడా జోడించి అందరిని నవ్వించారు. దానికి తగ్గట్టుగానే సినిమా పూర్తి వరకు కొనసాగుతుంది. మొదటి భాగం గంటా పది నిమిషాలు ఉండగా సెకండ్ హాఫ్ నలభై నిమిషాలు మాత్రమే ఉంటుంది. హీరో కొండా వెంకట రాజేంద్ర అద్భుతంగా ఈ సినిమాలో నటించారు. అటు హీరోయిన్ సుష్మిత కూడా అద్భుతంగా. ఇతర నటీనటులు కూడా తమ పాత్రల్లో ఒదిగిపోయారు. మ్యూజిక్ కూడా అద్భుతంగా అందించారు. కెమెరా రేవంత్ అలాగే అరవిందు లొకేషన్స్ ను బాగా చూపించారు.

సినిమా రేటింగ్ : 3/5

Read more RELATED
Recommended to you

Latest news