ఏపీలో అమ్మాయిల మిస్సింగ్ లను పోలీసులు పట్టించుకోరు అని కూటమి సర్కార్ పై ఫైర్ అయ్యారు పేర్ని నాని. పవన్ కల్యాణ్ చెబితేనే పోలీసులు పని చేస్తారా..? అని ఇలదీశారు. పవన్ కళ్యాణ్ తో చిక్కడు దొరకడు సినిమా తియ్యాలి అని చురకలు అంటించారు అంటించారు పవన్ కళ్యాణ్.

చంద్రబాబుకు ఆపద వస్తే ఒక చెల్లి, ఒక తమ్ముడు కలుగులోంచి వస్తారని సెటైర్లు పేల్చారు. గత ఎన్నికల్లో మన్నవ గ్రామంలో YSRCPకి మెజార్టీ వచ్చింది… YSRCPకి పట్టున్న గ్రామాల్లో రాజకీయ అలజడులు సృష్టిస్తున్నారని ఫైర్ అయ్యారు. వెళ్లనూరులో ఆరుగురిని ఎందుకు చంపారు..? రాజకీయ లబ్ధి కోసం కాదా అని ప్రశ్నించారు పేర్ని నాని. నాగమల్లేశ్వర రావు కుటుంబానికి నాలుగు దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉంది… టీడీపీ నేతల దోపిడీని అడ్డుకోవడమే నాగమల్లేశ్వర రావు చేసిన నేరమా? బాబురావు మీద దాడి చేసి కొడుతుంటే అడ్డుపడింది నాగమల్లేశ్వర రావు కాదా..? అని నిలదీశారు.