కరోనా దెబ్బకి విల విల్లాడుతున్నారుగా పాపం ..?

-

కరోనా విసిరిన పంజాకి దేశ వ్యాప్తంగా అంధకారం అయినట్టుగా తయారైంది. ఈ నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ మూలంగా ప్రస్తుతం రిలీజ్ కి సిద్దంగా ఉన్న సినిమాల రిలీజ్ డేట్స్ ని మార్చుకుంటున్నారు మేకర్స్. ఇందులో భాగంగా మే 15 న రిలీజ్ అనుకున్న పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ ఆగష్టు లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు దిల్ రాజు. నాని నటించిన ‘వి’ సినిమా జూన్ లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘టక్ జగదీశ్’ కూడా అక్టోబర్ కి జరిపే చాన్సెస్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో నాగచైతన్య సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల తెరకెక్కించిన ‘లవ్ స్టోరీ’ సినిమాని కూడా రిలీజ్ డేట్ మార్చినట్టుగా సమాచారం.

 

‘మజిలీ’, ‘వెంకీమామ’ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న నాగచైతన్య శేఖర్ కమ్ముల తెరకెక్కించిన లవ్ స్టోరీ మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. అంతేకాదు ఈ సినిమాతో హ్యాట్రిక్ హిట్ అందుకోవాలనుకున్నాడు. అయితే ఈ సినిమాను ముందు ఏప్రిల్ లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ కరోనా ఎఫెక్ట్ తో మే నెల చివరి వారానికి పోస్ట్ పోన్ చేసినట్లు చెప్పుకొచ్చారు. అయితే ప్రస్తుత లాక్ డౌన్ ని పొడిగించిన కారణంగా జూలైకి వాయిదా వేశారని తాజా సమాచారం. అయితే రిలీజ్ ఎప్పుడు చేసిన పెద్దగా ఉపయోగం ఉండదేమోనని అక్కినేని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారట.

ఇక ఇండస్ట్రీ వర్గాల సమాచారం మేరకు ఈ సినిమా శాటిలైట్ రైట్స్ అండ్ ఓవర్సీస్ రైట్స్ నాగ చైతన్య గత సినిమాలన్నింటికంటే భారీగానే పలికినప్పటికి ఇప్పుడు కాస్త డిఫ్రెన్సెస్ వచ్చే అవకాశాలున్నాయని అంటున్నారు. శేఖర్ కమ్ముల గత చిత్రం ‘ఫిదా’ భారీ బ్లాక్ బస్టర్ అన్న విషయం తెలిసిందే. దాంతో ఈ సినిమా మీద భారీగా అంచనాలు నెలకొన్నాయి. అదీ గాక ఈ సినిమాలో నాగచైతన్య సాయిపల్లవి కాంబినేషన్ కి మంచి క్రేజ్ ఏర్పడింది. అంతేకాదు టైటిల్ కి టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇవన్ని కలిసి సినిమా బ్లాక్ బస్టర్ అన్న ధీమా కలిగింది. అయితే అవన్నీ ఇప్పుడు తారుమారు అవుతాయా అన్న డైలమా యూనిట్ లో నెలకొందట.

Read more RELATED
Recommended to you

Latest news