మా అధ్యక్షుడి గా నరేశ్ కి ఆఖరి రోజు ?

‘మా’ అసోసియేషన్ లో రోజు రోజుకి వివాదాలు బయట పడుతున్న తరుణంలో ‘మా’ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్న ఘట్టమనేని నరేష్ పదవి పోయేటట్లు ప్రస్తుత పరిస్థితి ఉందని ఇండస్ట్రీలో వార్తలు వినబడుతున్నాయి. మా ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ అయిన నాటి నుండి ఇప్పటి వరకు ప్రతిరోజు మా అసోసియేషన్ సభ్యుల మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి.

Image result for maa narash"

దీంతో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఎన్నిసార్లు కలుగజేసుకుని గొడవలు లేకుండా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నా ‘మా’ సభ్యులు సహకరించకపోవడంతో ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు ఇండస్ట్రీ పరువు పోకుండా అందరూ కలిసి మళ్లీ ‘మా’ ఎన్నికలు జరిపించాలనే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

ముఖ్యంగా ‘మా’ డైరీ ఆవిష్కరణ సమయంలో మీడియా ముందే రాజశేఖర్ దంపతులకు మరియు ఇండస్ట్రీ పెద్దల మధ్య బహిరంగంగా గొడవ జరగడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీంతో నరేష్ కి ఆఖరి రోజు మా అసోసియేషన్ సభ్యుడిగా త్వరలో రానున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు గట్టిగా వినబడుతున్నాయి. అంతేకాకుండా నరేష్ ‘మా’ అసోసియేషన్ కి వస్తున్న డబ్బులను కూడా సైడ్ చేస్తున్నట్లు ఇండస్ట్రీ పెద్దల దృష్టికి వెళ్లడంతో త్వరలోనే ‘మా’ ఎన్నికలు మళ్లీ నిర్వహించాలని గట్టిగా డిసైడ్ అయినట్లు సమాచారం.