మరోసారి ఆలోచింపజేసిన సింగర్ మధు ప్రియ పాట…

-

మధు ప్రియ తెలంగాణ యాసలో పాటలు పాడుతూ…. తెలంగాణ వ్యాప్తంగా ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకుంది. మధు ప్రియ గొంతు సవరించిందంటే… ఎలాంటి పాటైనా సరే హిట్ అవుతుందన్న నమ్మకం ఆమె అభిమానుల్లో బలంగా ఉంది. మనీ కోసం కాకుండా సమాజంలోని అసమానతలను తగ్గించడం కోసమే ఈ చిన్నది పాటలు ఎక్కువగా పాడుతుంటుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని బొగ్గు గనుల ప్రాంతానికి చెందిన వెనుకబడిన కుటుంబం నుంచి మధు ప్రియ వచ్చింది. మొదటి పాటతోనే తనకంటూ సంగీత లోకంలో ప్రత్యేక గుర్తింపును సంపాధించుకుంది. ఫేమ్ వచ్చిన తర్వాత చాలా మంది గాయనీ, గాయకులు కమర్షియల్ గా ఆలోచిస్తుంటారు.

 మధు ప్రియ | Maanavathwam Marichipothundo

కానీ ఈ సింగర్ మధు ప్రియ మాత్రం తన ప్రయాణంలో ఏనాడు డబ్బు కోసం వెంపర్లాడలేదు. ఆడపిల్లనమ్మ నేను పాడుపిల్లనాట అంటూ నేటి సమాజంలో ఆడ పిల్లలను ఎలా చులకన భావంతో చూస్తున్నారో మన కళ్లకు కట్టినట్లు పాడి వినిపించింది. ఎక్కడ లేని ఫేమ్ సంపాదించుకున్న మధు ప్రియ తెలుగు బిగ్ బాస్ షోలోకి కూడా ప్రవేశించింది. కానీ అక్కడి వాతావరణం మధు ప్రియ శైలికి సెట్ అవ్వలేదు.

తాజాగా మధు ప్రియ పాడి విడుదల చేసిన మారిపోతున్నాడు మనిషన్నవాడు అంటూ సాగే పాట అందరినీ ఆలోచింపజేస్తుంది. ప్రస్తుత సమాజంలో మానవులు చేస్తున్న పాపాల గురించి చక్కగా వివరించింది. నీతి నిజాయితీ లేకుండా మనుసులు నేడు జీవనం సాగిస్తున్నారని పాటలో ఉంది. కోట్ల డబ్బులు మూలుగుతున్నా… కూడా సాటి మనిషికి సాయం కాడని తెలిపాడు. మానవత్వం మరిచిపోయి… మనిషన్నవాడు కాలయముడిగా మారిపోతుండో అని పాట సాగుతుంది. మరో విశేషమేంటంటే… ఈ పాటను మధుప్రియను నిర్మించింది. తాను సొంతంగా డబ్బులు పెట్టి సమాజ హితం కోసం ఇలాంటి పాటలు పాడటమే కాక నిర్మించడమనేది మధు ప్రియకే చెల్లిందని అంటున్నారు. ఆమెను తప్పక మెచ్చుకోవాల్సిన అంశంగా పలువురు పేర్కొంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news