మాస్ రాజా తమరి సక్సస్ లు ఏమయ్యాయి రాజా …?

-

ఇన్నేళ్ళుగా టాలీవుడ్ లో మాస్ మహారాజ అన్న మాస్ ఇమేజ్ ఒక్క రవితేజ కి మాత్రమే ఉంది. అది ఇప్పటి వరకు ఆయనకి మాత్రమే సాధ్యమైందని చెప్పాలి. అయితే గత కొన్నేళ్ళుగా రవితేజ టైం ఏమాత్రం బాగా లేదు. వరుసబెట్టి సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బకెట్ తన్నేస్తున్నాయి. ఫ్లాపుల మీద ఫ్లాపులొస్తున్న రవితేజకి రాజాది గ్రేట్ రూపంలో ఓ హిట్ దక్కి కాస్త ఊరటనిచ్చింది. అయితే ఆ సినిమా తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు హిట్ పడలేదు. యధావిధంగా వరుస ప్లాప్ లతో ఇరిటేట్ అవుతున్నాడు.

 

ఒక పక్క అల్లు అర్జున్, మహేష్ బాబు. ఎన్.టి.ఆర్, రాం చరణ్ … లాంటి స్టార్ హీరోల పోటీ కూడా విపరీతంగా ఉంది. దానికితోడు వరుస ఫ్లాప్స్ తో రవితేజ మార్కెట్ కూడా బాగా తగ్గిపోయింది. మళ్ళీ తన మార్కెట్ పెరగాలంటే ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న పోటీని తట్టుకోవాలంటే అర్జెంటుగా ఒక మంచి కమర్షియల్ హిట్ సినిమా కావాలి.

ఆ హిట్ సినిమాని దక్కించుకోవడం కోసమే క్రాక్ సినిమాలో నటిస్తున్నాడు రవితేజ. ఇంతకముందు రవితేజ తో డాన్ శ్రీను, బలుపు వంటి కమర్షియల్ హిట్ సినిమాలను తెరకెక్కించిన గోపీచంద్ మలినేని క్రాక్ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఒక పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో రవితేజ నటిస్తున్న ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.

అయితే సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నపటికి రవితేజ కి మాత్రం అవకాశలు దండిగానే వస్తున్నాయి. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూనే ఉన్నారు. బహుషా ఇలా వరుస ఫ్లాప్స్ ఉన్నా కూడా సినిమాలు చేస్తున్న టాలీవుడ్ హీరో ఒక్క రవితేజ మాత్రమే. అందుకే ఫ్యాన్స్, ప్రేక్షకులు సినిమాలైతే వరుసగా చేస్తున్నారు. కనీ హిట్స్ ఎక్కడున్నాయి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారైనా క్రాక్ సినిమాతో హిట్ ఇచ్చి మళ్ళి ఫాం లోకి వస్తారేమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news