మ‌హేష్ వ‌ర్సెస్ బ‌న్నీ కొత్త లొల్లి.. ఈ లొల్లి ఆగ‌దా..!

282

టాలీవుడ్‌లో ఏ ఇద్ద‌రు స్టార్ హీరోల మ‌ధ్య అయినా ప్ర‌త్య‌క్షంగా లేదా ప‌రోక్షంగానో ఏదా ఫ్యాన్స్ ద్వారానో అంత‌ర్గ‌త యుద్ధాలు కామ‌న్‌. ఇక టాలీవుడ్‌కు గోల్డెన్ సీజ‌న్ అయిన సంక్రాంతి బ‌రిలో త‌మ సినిమాలు దింపేందుకు అంద‌రూ వెయిట్ చేస్తుంటారు. ఎంత సంక్రాంతి సీజనైనా ఒకేసారి ఇద్దరు ముగ్గురు స్టార్లు తలపడాల్సి వచ్చినప్పుడు థియేటర్ల సమస్య త‌ప్ప‌దు. గ‌త మూడు నాలుగు సంక్రాంతిల‌కు ఇది కామ‌న్‌గా జ‌రుగుతూ వ‌స్తోంది.

ఇక వ‌చ్చే 2020 సంక్రాంతికి పెద్ద చిక్కే వచ్చేలా ఉంది. మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు – అల్లు అర్జున్ అల వైకుంఠపురము సంక్రాంతికి రిలీజ్‌కు ఖ‌ర్చీఫ్ వేసేశాయి. స‌రిలేరు నీకెవ్వ‌రు సినిమాకు దిల్ రాజు కూడా ఒక నిర్మాత‌. రాజు సినిమా రంగంలో ఉంటే థియేట‌ర్ల‌కు ఇబ్బంది ఉండ‌దు. అటు నైజాంలో ఇటు ఉత్త‌రాంధ్ర‌లో డిస్ట్రిబ్యూష‌న్, థియేట‌ర్ల‌లో రాజు రారాజే.

ఇక అల వైకుంఠ‌పురం సినిమాకు అల్లు అర‌వింద్ అండ ఉండ‌నే ఉంది. ఇక ఈ రెండు సినిమాలు పోటీలో ఉండ‌డంతో దిల్ రాజు మూడు రోజులు గ్యాప్ ఇచ్చి అల వైకుంఠపురములో విడుదల చేస్తే ఇద్దరికీ ఓపెనింగ్స్ పరంగా ఎలాంటి చిక్కు ఉండదని ప్రతిపాదన పెట్టాడ‌ట‌. అల్లు కాంపౌండ్ మాత్రం ఒక్క రోజు మాత్ర‌మే గ్యాప్ ఇస్తామ‌ని… లేట్ అయితే సెలువులు క్యాష్ చేసుకోలేమ‌ని.. అప్పుడు త‌మ సినిమాకు ఓవ‌రాల్ వ‌సూళ్లు త‌గ్గుతాయ‌ని చెపుతోంద‌ట‌.

రాజు మాత్రం రెండు రోజులు అయినా గ్యాప్ ఉండాల‌ని చెపుతున్నాడ‌ట‌. అలాగే ఎవ‌రికి వారు ఎక్కువ థియేట‌ర్ల‌లో త‌మ సినిమాలు రిలీజ్ చేసుకునే ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఏదేమైనా ఈ ఇద్ద‌రు హీరోల సినిమాల మ‌ధ్య థియేట‌ర్ల లొల్లి కూడా తీవ్ర‌మ‌య్యేలా ఉంది.