మహేష్ ఎనదర్ మిస్టేక్

-

సూపర్ స్టార్ మహేష్ ప్రస్తుతం వంశీ పైడిపల్లి డైరక్షన్ లో మహర్షి సినిమా చేస్తున్నాడు. తన ఫ్యాన్స్ ను ఆనంద పరచడంలో ఎప్పుడు ముందుండే మహేష్ ఈ దసరాకు ఎలాంటి టీజర్, పోస్టర్ వదలలేదు కాని తానే స్వయంగా విష్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరించాడు. అయితే ఇక్కడే వచ్చింది అసలు చిక్కు. దసరా శుభాకాంక్షలు చెప్పిన మహేష్ తెలుగు, తమిళ, హింది, మళయాల అభిమానులకు తన విశెష్ అందించాడు.

కన్నడ అభిమానులను మాత్రం మర్చిపోయాడు. లాస్ట్ టైం ఒకసారి ఇలానే కన్నడ అభిమానులను మర్చిపోయిన మహేష్ తర్వాత సరిచేసుకున్నాడు. ఇప్పుడు కూడా కన్నడ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారని గుర్తించి మళ్లీ తర్వాత స్పెషల్ గా కన్నడ ఫ్యాన్స్ కు దసరా శుభాకాంక్షలు తెలిపాడు మహేష్. ప్రస్తుతం యూఎస్ లో ఓ పక్క మహర్షి షూటింగ్ జరుపుకుంటూనే మరోపక్క పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు మహేష్. మరి ఫ్యూచర్ లో మహేష్ ఇలాంటి మిస్టేక్స్ చేయకుండా ఉంటే బెటర్ అని ఆశిస్తున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్.

Read more RELATED
Recommended to you

Latest news