కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిసిన కేటీఆర్..!

-

తెలంగాణ లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుర్తుపై విజయం సాధించిన వారు ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం విధితమే. అయితే పార్టీ మారిన వారిపై పార్టీ తరపున వేసిన కేసును కూడా నేడు ఫాలో అప్ చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మా పార్టీ నేతల బృందం న్యాయవాదులతో సమావేశం అవుతుందని వెల్లడించారు. కచ్చితంగా పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడేవిధంగా కోర్టులో కొట్లాడుతామని వెల్లడించారు. ఢిల్లీ కేంద్ర మంత్రులు ధర్మేంధ్ర ప్రధాన్, నితిన్ గడ్కరీ లను కలిశారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా దేశ పౌరులు విజయవంతంగా తమ నైపుణ్యాలను ప్రదర్శిస్తున్నారంటే దానికి ప్రధాన కారణం దేశంలోని యూనివర్సిటీలే అని చెప్పారు. దేశంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పరిధితో పాటు అనేక ప్రైవేటు విద్యా సంస్థలు, యూనివర్సిటీలు ఐఐటీ వంటి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ విద్యాసంస్థలు కూడా ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ రోజు యూజీసీ నిబంధనలో తేవాలనుకుంటున్న మార్పుల పై మా పార్టీ డిమాండ్లను కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కి తెలియజేశామని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news