F3 లో మహేష్ బాబు…… అసలు నిజం ఇదే…. ??

-

టాలీవుడ్ వరుస విజయాల దర్శకుడు అనిల్ రావిపూడి, సూపర్ స్టార్ మహేష్ తో తీసిన లేటెస్ట్ మూవీ సరిలేరు నీకెవ్వరు మొన్న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ కొట్టింది. మహేష్ బాబు ఒక ఆర్మీ మేజర్ గా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా సీనియర్ నాయిక విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించడం జరిగింది. ఇక ఈ సినిమా మంచి సక్సెస్ సాధించడంతో అనిల్ అంటే మహేష్ కు మరింతగా అభిమానం పెరిగిందని,

అందుకే తదుపరి అనిల్ ఎఫ్2 కు సీక్వెల్ గా తెరకెక్కించనున్న ఎఫ్3 లో ఆయన ఒక ముఖ్య పాత్రలో నటించనున్నట్లు ఇటీవల పలు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. అయితే ఇందులో ఏ మాత్రం నిజం లేదని కొందరు మహేష్ బాబు సన్నిహితులు చెప్తున్నట్లు టాక్. నిజానికి అనిల్ రాసుకున్న ఎఫ్3 స్క్రిప్ట్ లో వెంకటేష్, వరుణ్ తేజ్ ల తో పాటు మరొక హీరోగా కూడా ఉంటారని, అయితే అది మాత్రం మహేష్ అయితే కాదని,

 

ఎందుకంటే ఇటీవల తన ఫ్యామిలీ తో కలిసి టూర్ కి వెళ్లి మొన్ననే తిరిగివచ్చిన మహేష్, తదుపరి వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేయబోయే సినిమా కథా చర్చల్లో ఉన్నారని, అలానే ఆ సినిమాలోని తన క్యారెక్టర్ కోసం ఇప్పటినుండే ఆయన సిద్ధం అవుతున్నారని అంటున్నారు. అయితే ఎఫ్3 లో మాత్రం రవితేజ, లేదా రానా నటించే ఛాన్స్ ఉందని కూడా సమాచారం. ఇక ఈ విషయం బయటకు రావడంతో ఎఫ్3 లో మహేష్ బాబు నటించడం విషయమై ప్రచారం అవుతున్న వార్తలకు కొంతవరకు చెక్ పడ్డట్లైంది అనే చెప్పాలి….!!

Read more RELATED
Recommended to you

Latest news