త్రివిక్రమ్ కోసం మహేష్ ప్రయత్నాలు…!

-

సూపర్ స్టార్ మహేష్ బాబు తో సినిమా చెయ్యాలని ఎందరో దర్శకులు ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి మహేష్ బాబు మాత్రం ఒక దర్శకుడి తో సినిమా చేయడానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు. అతడే త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్ తో సినిమా కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాడు మహేష్ బాబు. త్రివిక్రమ్ ఇటీవల అల వైకుంఠపురములో సినిమా తో అందరిని ఫిదా చేసిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మహేష్ బాబు కూడా త్రివిక్రమ్ తో సినిమా చెయ్యాలి అనుకోవడానికి ప్రధాన కారణం అదే అని అంటున్నారు. త్రివిక్రమ్ తో గతంలో మహేష్ బాబు రెండు సినిమాలు చేసాడు. అతడు, ఖలేజా సినిమాలు చేసాడు. ఈ రెండు సినిమాల్లో ఒక్కటి కూడా సూపర్ హిట్ అవ్వలేదు. అతడు సినిమా మాత్రం పర్వాలేదు అనిపించింది. ఇప్పుడు మళ్ళీ త్రివిక్రమ్ తో ఎందుకు సినిమా చెయ్యాలని మహేష్ అనుకుంటున్నాడు అనేది తెలియదు.

మహేష్ బాబు ఇప్పుడు త్రివిక్రమ్ కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నాడని అంటున్నారు. అయితే త్రివిక్రమ్ మాత్రం ఎన్టీఆర్ తో సినిమాలో చాలా బిజీ గా ఉన్నాడు. ఈ సినిమా కోసం కథ రెడీ చేసుకుంటున్నాడు అంటున్నారు. అంటే వచ్చే ఏడాది వేసవి వరకు ఖాళీ లేదు. ఆ సినిమా వేసవిలో ప్రేక్షకుల ముందుకి వస్తుంది. మరి ఆ తర్వాత సినిమా చేస్తాడా అనేది చూడాల్సి ఉంది. ఇది ఎంత వరకు నిజమో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news