వణికిపోతున్న గుంటూరు… రెడ్ జోన్లు ఇవే…!

-

గుంటూరు జిల్లా వాసులను కరోనా వైరస్ బాగా భయపెడుతుంది. ఢిల్లీ మత ప్రార్ధనలకు వెళ్లి వచ్చిన వారు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు. వారి నుంచి కరోనా వైరస్ వ్యాపించే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇప్పటికే జిల్లాలో 20 కి పైగా కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఢిల్లీకి వెళ్లి వచ్చిన వారిలో ఇంకా 20 మందిని గుర్తించాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు…? ఎం చేస్గ్తున్నారు అనేది అర్ధం కావడం లేదు.

ఇది పక్కన పెడితే కరోనా వైరస్ తీవ్రతకు గుంటూరు, మాచర్ల, అచ్చంపేట, క్రోసూరు, మేడికొండూరు(తురకపాలెం), మంగళగిరి పాంత్రాలను రెడ్‌జోన్లుగా ప్రకటించారు. ఈ ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ బయటకు రాకుండా అధికారులే నిత్యావసర సరుకులను సరఫరా చేస్తున్నారు. వైరస్‌ పాజిటివ్‌ కేసులు ఇంకా పెరిగే అవకాశం ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది రాష్ట్ర ప్రభుత్వం. ప్రజలు కూడా ఎవరూ బయటకు రావడం లేదు.

రాబోయే రెండు మూడు రోజుల్లో ఈ కేసుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఎవరూ కూడా బయటకు రాకుండా జాగ్రత్తలు పడితే మంచిది అని అధికారులు పలు సూచనలు చేస్తున్నారు. వైద్య, ఇతర సిబ్బందిని ఎవరైనా అడ్డగిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక జిల్లాలోని గ్రామాలలో కూడా ఇప్పుడు ప్రజలకు భయం మొదలయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో అనే ఆందోళన వ్యక్తమవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news