సూపర్‌స్టార్ మహేష్‌బాబు ఇప్పటి వరకు మెలితిప్పిన మీసంతో కనిపించలేదు. ఇంకా చెప్పాలంటే గుబురు మీసాలతో కనిపించలేదనే చెప్పాలి. `భరత్ అనే నేనే` చిత్రంలోని ఓ పాటలో మాత్రమే హీరోయిన్ని కలవడం కోసం మారు వేషంలో వచ్చే హీరోగా పెట్టుడు మీసంతో కనిపించాడు. తాజాగా ఈ సారి మెలితిప్పిన మీసంతో కనిపించి సర్ప్రైజ్ చేశాడు మహేష్. అయితే అది సినిమా కోసం అనుకుంటే మీరు ప్పులో కాలేసినట్టే. మహేష్ గత కొంత కాలంగా అంటే నమ్రతతో వివాహం జరిగిన దగ్గరి నుంచి కమర్షియల్ యాడ్స్ లో కనిపిస్తున్నాడు.
థమ్స్ అప్ యాడ్‌కు తొలిసారి బ్రాండ్ అంబాసిడర్‌గా మారిన మహషే ఆ తరువాత సాయి సుధా డెవెలాపర్స్, బైజూస్ లెర్నింగ్ యాప్, బ్లాక్ అండ్ వైట్ షాంపూ, అభిబస్, రాయల్ స్టాగ్, డెన్వర్, సంతూర్ వంటి బ్రాండ్లకు అంబాసిడర్‌గా ఒప్పందాలు చేసుకున్నారు. తాజాగా ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకున్న మహేష్ తాజాగా దీని కోసం ఓ వాణిజ్య ప్రకటనలో నటించారు. ద్విపాత్రాభినయం చేసిన మహేష్ ఓ క్యారెక్టర్లో మీసం మెలేసి మాస్ లుక్‌లో కనిపించడం ఆకట్టుకుంటోంది. మహేష్ ని ఈ లుక్‌లో వెండితెరపై ఎప్పుడు చూస్తామా అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు.