గల్లా అరుణను బాబు ఆదర్శంగా తీసుకుంటారా?

-

నిజమైన కార్యకర్త, నిజమైన పార్టీ అభిమాని, నిజమైన పార్టీ శ్రేయోభిలాషి అంటే… తాను ముఖ్యంకాదు, తన పదవులు ముఖ్యంకాదు, పార్టీ ముఖ్యం అని భావించేవారు అని అంటారు! ఈ విషయంలో తాజాగా గల్లా అరుణకుమారిని అభినందిస్తున్నారు తమ్ముళ్లు! దీంతో ఈ విషయంలో చంద్రబాబు ఆదర్శంగా తీసుకోవాలాని కోరుతున్నారు!

అవును… తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యత్వానికి మాజీ మంత్రి గల్లా అరుణకుమారి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే! అందుకు అసలైన కారణాలు ఏమైనప్పటికీ… ఆమె చెప్పిన కారణం మాత్రం.. “టీడీపీకి పూర్వ వైభవం చేకూర్చాలంటే పొలిట్ ‌బ్యూరో సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా పర్యటించాల్సి ఉంటుంది.. వయోభారం కారణంగా అంత ఓపిక నాకు లేదు.. ఆ పదవికి న్యాయం చేయలేను” అని! ఇది నిజమైన కార్యకర్త, పార్టీ శ్రేయోభిలాషి లక్షణం అని అంటున్నారు తమ్ముళ్లు!

అవును వయోభారంతో, కరోనా భయంతో రాష్ట్రాన్ని, కార్యకర్తలను వదిలి పక్కరాష్ట్రంలో తలదాచుకుంటున్న చంద్రబాబుకు తమ్ముళ్లు ఈ మేరకు సూచన చేస్తున్నారు. మరోపక్క అల్జీమర్ వ్యాది కూడా ఉందనే కథనాలు, కామెంట్లు వస్తున్న సంగతీ తెలిసిందే! దీంతో… ఈ వయసులో బాబుగారు తిరగలేరు.. బయటకు రాలేరు.. జనాల్లో ఉత్సాహంగా కలవలేరు.. అన్ని నియోజకవర్గల్లోనూ పర్యటించలేరు.. కాబట్టి బాబు కూడా అరుణ లాగా తనకు తానే అర్ధం చేసుకోవాలని.. ఫలితంగా పార్టీ బాధ్యతలనుంచి తప్పుకోవాలని కోరుతున్నారంట!

ఈ సమయంలో బాబు అలాంటి నిర్ణయం తీసుకుని… “బయటకు వెళ్తాను డాడీ” అని చినబాబు అంటే ఆయనకు.. లేదంటే యువకులు ఉత్సాహవంతులైన మరొకరికి పూర్థిస్థాయిలో పార్టీని అప్పగించాలని, అలా చేస్తే పార్టీకి చాలా మేలుచేసినవారు అవుతారని అంటున్నారట టీడీపీ అసలు సిసలు కార్యకర్తలు! మరి బాబుకు కూడా గల్లా అరుణకున్నంత పెద్ద మనసు ఉందా… లేక పార్టీ భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయినా పర్లేదు.. తాను మాత్రం కుర్చీ వదలను అని అంటారా అనేది వేచి చూడాలి!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version