మ‌హేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ టైటిల్ అలా వ‌చ్చింద‌ట‌..!

-

సూప‌ర్ స్టార్‌ మహేష్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రమోషన్ పనిలో బిజీ అయిపొయింది. అందులో భాగంగానే ఇప్పటికే సినిమా నుంచి నాలుగు పాట‌లు విడుద‌ల చేయ‌డంతో అలు ప్రేక్ష‌కుల‌ను ఇటు అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటూ దూసుకుపోతున్నాయి. దీంతో సినిమాపై కూడా భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఇక రష్మిక మందన హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రంను దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సమర్పణలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్లపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు.

అలాగే అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో ముఖ్య ఆక‌ర్ష‌ణ‌ లేడీ అమితాబ్‌ విజయశాంతి కీలకపాత్రలో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. సాధార‌ణంగా మ‌హేష్ సినిమా టైటిల్స్ అన్నీ చాలా చిన్న‌గా ఉంటాయి. ఇక ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మాత్రమే మహేష్ బాబు కెరీర్‌లో అతిపెద్ద పేరుతో వచ్చిన సినిమా. కానీ ‘సరిలేరు నీకెవ్వరు’ విషయానికొస్తే.. ఈ చిత్రం టైటిల్.. ఒకప్పటి ఎన్టీఆర్, హీరోగా నటించిన ‘కంచుకోట’ సినిమాలో ఉన్న ‘సరిలేరు నీకెవ్వరు’ పాట పల్లవిని ఈ సినిమా టైటిల్‌గా పెట్టారు.

అలా మ‌హేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశార‌ట‌. మ‌రో విష‌యం ఏంటంటే.. ఒక పాట పల్లవిని మహేష్ బాబు లైఫ్‌లో తన సినిమాకు పెట్టుకోవడం ఇదే మొదటిసారి. కాగా, ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, బండ్ల గణేష్, అజయ్ వంటి ప్రముఖ నటులు క‌నిపించ‌నున్నారు. ఇక దేవీ శ్రీ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. అలాగే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 5న జ‌ర‌గ‌నుంది. ఈ ఈవెంట్ మెగా స్టాట్ చిరంజీవి ముఖ్య అతిథిగా రాబోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version