కొత్త వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన అర్జున్ రెడ్డి..

-

ఒక్క సినిమాతోనే టాలీవుడ్‌లో క్రేజీ స్టార్‌గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ. పెళ్లి చూపులు సినిమాతో హీరోగా పరిచయం అయిన విజయ్‌, అర్జున్‌ రెడ్డి సినిమాతో నేషనల్‌ లెవల్‌లో సెన్సేషన్‌ సృష్టించాడు. అదే జోరులో గీత గోవిందం సినిమాతో మరో సక్సెస్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు విజయ్‌. ఇక సినిమాలు చేస్తూనే అగ్ర హీరోగా ఎదిగిన విజయ్ వ్యాపారం రంగంలో కూడా దూసుకుపోతున్నాడు. ఇప్పటికే రౌడీ అనే దుస్తుల వ్యాపారాన్ని స్టార్ట్ చేసిన‌ విజయ్ దేవరకొండ ఇప్పుడు మ‌రో కొత్త వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నాడు.

ఇంతకు విజయ్ స్టార్ట్ చేయనున్న వ్యాపారమేంటో తెలుసా? మల్టీప్లెక్స్ థియేటర్ బిజినెస్. ఏషియన్ సినిమాస్‌తో కలిసి విజయ్ దేవరకొండ మల్టీప్లెక్స్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారట. మహబూబ్ నగర్‌లో ఏవీడీ పేరుతో తొలి మల్టీప్లెక్స్ థియేటర్‌ను స్టార్ట్ చేయబోతున్నారట. గత ఏడాది మహేశ్‌తో కలిసి ఏఎంబీ సినిమాను స్టార్ట్ చేసిన ఏషియన్ సంస్థ తాజాగా విజయ్ దేవరకొండతో చేతులు కలపడం విశేషం. కాగా, ఇప్ప‌టికే విజయ్ సినిమా ప్రొడక్షన్‌లోకి కూడా దిగారు. తొలి చిత్రంగా ‘మీకు మాత్రమే చెప్తాను’ నిర్మించారు. ఈ చిత్రం కూడా బాగానే లాభాలను తెచ్చిపెట్టింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version