మెగాస్టార్ రికార్డుకు చెద‌లు: స‌రిలేరు దెబ్బ‌తో సైరా రికార్డు అవుట్‌

-

టాలీవుడ్ సూప‌ర్‌స్టార్ మ‌హేష్‌బాబు న‌టించిన సరిలేరు నీకెవ్వరు సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి తొలి రోజు టాక్‌తో సంబంధం లేకుండా రికార్డుల మీద రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఈ క్ర‌మంలోనే మ‌హేష్ సొంత జిల్లా అయిన గుంటూరు జిల్లాలో పాత రికార్డుల‌కు స‌రిలేరు పాత‌ర వేసింది. గుంటూరు జిల్లాలో మొదటి రోజు ఏకంగా 5.14 కోట్ల షేర్ తో ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా నిలిచింది. గుంటూరులో ఆల్ టైం సెకండ్ హైయెస్ట్ గా ఉన్న సైరా చిత్రాన్ని సరిలేరు నీకెవ్వరు దాటివేసింది.

mahesh babu Create New record ,
mahesh babu Create New record ,

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన సైరా సినిమా ఇదే గుంటూరు జిల్లాలో తొలి రోజు రు 5.06 కోట్ల వ‌సూళ్లు రాబ‌ట్టింది. ఇక బాహుబ‌లి 2 మాత్ర‌మే ఇప్ప‌టి వ‌ర‌కు ఆ జిల్లాలో రు 6.18 కోట్ల వ‌సూళ్ల‌తో ఆల్ టైం హ‌య్య‌స్ట్ టాప్ సినిమాగా రికార్డుల‌కు ఎక్కింది. ఇక స‌రిలేరు సైరా రికార్డు బీట్ చేసి రెండో స్థానంలో ఉంది. ఇక మ‌హేష్‌కు ప‌ట్టున్న కృష్ణా జిల్లాలోనూ తొలి రోజు స‌రిలేరు 3.07 కోట్ల ఫస్ట్ డే కలెక్షన్స్ తో సైరా పేరిట 3.02 కోట్లతో ఉన్న రికార్డు సొంతం చేసుకుంది.

ఇక ఆదివారం బ‌న్నీ న‌టించిన అల వైకుంఠ‌పుర‌ములో విడుద‌ల‌వుతోన్న నేప‌థ్యంలో రెండో రోజు నుంచి స‌రిలేరు థియేట‌ర్ల‌ను బాగా త‌గ్గించేస్తున్నారు. ముఖ్యంగా బీ, సీ సెంట‌ర్ల‌లో స‌రిలేరు ఈ రోజు ఆపేసి అల సినిమా వేస్తుండ‌డంతో రెండో రోజు స‌రిలేరు వ‌సూళ్లు త‌గ్గే అవ‌కాశాలు ఉన్నాయి. ఇక ఏకే ఎంట‌ర్టైన్‌మెంట్‌, జీఎంబీ బ్యానర్ల‌పై తెర‌కెక్కిన స‌రిలేరు సినిమాలో మ‌హేష్ స‌ర‌స‌న రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా, విజయ శాంతి కీలక రోల్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news