సూపర్‌స్టార్ కృష్ణ తనయుడిగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ప్రిన్స్ మహేశ్ బాబు అనతికాలంలోనే తండ్రికి మించిన తనయుడిగా సూపర్ స్టార్‌గా ఎదిగాడు. వరుస సినిమాలతో దూసుకెళ్తూ బాక్సాఫీస్ బద్ధలు కొట్టడమే కాదు.. తన మంచితనంతో అభిమానుల గుండెలు కొల్లగొడుతున్నాడు. సేవా కార్యక్రమాల్లో మహేశ్ బాబు ఎప్పుడూ ముందుంటాడన్న విషయం తెలిసిందే. ఇప్పటికే మహేశ్ బాబు ఫౌండేషన్ పేరుతో ఎంతో మంది చిన్నారులకు హార్ట్ ఆపరేషన్లకు సాయం చేస్తున్నాడు.
ఇక ఇప్పుడు తన తండ్రి సూపర్ స్టార్ కృష్ణ ప్రథమ వర్ధంతి సందర్భంగా మహేశ్ బాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నాడు. పేద విద్యార్థులకు చేయూతనిచ్చేందుకు “సూపర్‌స్టార్ కృష్ణ ఎడ్యుకేషనల్ ఫండ్” పేరుతో 40 మందికి పైగా విద్యార్థులకు స్కాలర్ షిప్ అందించనున్నారు. స్కూలింగ్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు స్కాలర్ షిప్ ఇవ్వనున్నారు.
ఇక తన సతీమణి నమ్రతా శిరోద్కర్‌తో కలిసి మహేశ్ బాబు 2020లో మహేశ్ బాబు ఫౌండేషన్‌ను ప్రారంభించి ఇప్పటి వరకు 2500 మందికిపైగా చిన్నారులకు గుండెకు సంబంధించిన ఆపరేషన్లకు సాయం చేశారు. మరోవైపు . కృష్ణ స్వగ్రామం ఆంధ్రప్రదేశ్‌లోని బుర్రిపాలెంలో ఓ పాఠశాలను నిర్మించారు.