రేపు కాంగ్రెస్‌ లో చేరనున్న విజయశాంతి ?

-

బీజేపీ పార్టీకి విజయశాంతి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను కిషన్‌ రెడ్డికి పంపించారు విజయశాంతి. అయితే…రేపు కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారట విజయశాంతి. రేపు తెలంగాణకు రాహుల్‌ గాంధీ రానున్నారు. ఈ తరుణంలో… బీజేపీ పార్టీకి రాజీనామా చేసిన విజయశాంతి… రాహుల్‌ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పుకోనున్నారని సమాచారం. అలాగే… సోషల్ మీడియాలో ఓ పోస్ట్‌ కూడా పెట్టారు రాములమ్మ. తెలంగాణల సెటిలర్స్ అన్న భావన లేదు.

vijayashanthi comments on sonia gandhi
vijayashanthi into congress party

ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బిడ్డలు ఎవరైనా తెలంగాణ ప్రజలే, ఆ ప్రజల ప్రయోజనాలు, భధ్రత, తెలంగాణాల కాపాడబడి తీరాలన్న విధానం కచ్చితంగా సమర్ధించబడవలిసినదేనని వివరించారు. కానీ తరతరాలు పోరాడిన మా తెలంగాణ ఉద్యమకారులు ప్రాంతేతర పార్టీలను ఎన్నికల పరంగా ఆమోదించరన్నారు. అది, ఎప్పటికీ నిరూపితమైన వాస్తవం అని వివరించారు. అదే సమయంలో మరో అంశాన్ని తప్పక దృష్టిలో ఉంచుకోవాలి. ప్రాంతేతర పార్టీలను, అక్కడి ప్రాంతం నుంచి వచ్చి.. ఇక్కడ ఉంటున్న తెలుగు బిడ్డలను ఒకే గాటన కట్టడం ఎంత మాత్రం సరికాదని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news