సరిలేరు తరువాత లాంగ్ బ్రేక్ తీసుకోనున్న సూపర్ స్టార్ మహేష్ ….!!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, ఇటీవల భరత్ అనే నేను, మహర్షి సినిమాల వరుస విజయాలతో మంచి జోష్ మీదున్నారు. ప్రస్తుతం యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మంచి మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆయన హీరోగా నటిస్తున్నారు. తప్పకుండా తమ హీరో ఈ సినిమాతో హ్యాట్రిక్ విజయాలు అందుకుంటారని ఆయన ఫ్యాన్స్ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై సూపర్ స్టార్ ఫ్యాన్స్ తోపాటు టాలీవుడ్ ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు ఉన్నాయి.

మహేష్ ప్రక్కన యంగ్ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ద్వారా ఒకప్పటి సీనియర్ నటి మరియు లేడీ అమితాబ్ గా పేరు గాంచిన విజయశాంతి గారు చాలా ఏళ్ళ తరువాత టాలీవుడ్ కి నటిగా రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో ఆమె భారతి అనే ప్రొఫెసర్ పాత్రలో నటిస్తున్నట్లు ఇటీవల సినిమా యూనిట్ నుండి ఆమె అఫీషియల్ లుక్ కూడా బయటకు రావడం జరిగింది.

ఇకపోతే ఇప్పటికే చాలారోజులుగా వరుసగా సినిమాలు చేస్తున్న మహేష్ బాబు, సరిలేరు రిలీజ్ తరువాత దాదాపుగా మూడు నెలల లాంగ్ బ్రేక్ తీసుకోబోతున్నట్లు ఇటీవల ఆయన సతీమణి నమ్రత గారు ఒక పత్రిక కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పడం జరిగింది. గతంలో ఖలేజా రిలీజ్ సమయంలో దాదాపుగా మూడేళ్లు బ్రేక్ తీసుకున్న సూపర్ స్టార్, ఆ తరువాత ఎప్పుడూ ఇంత లాంగ్ బ్రేక్ తీసుకోలేదని, అయితే ఆయన కొంత మానసికంగా, మరియు శారీరకంగా దృఢంగా అవడం కోసమే ఈ బ్రేక్ తీసుకుంటున్నట్లు ఆమె చెప్తున్నారు. సో, దీనిని బట్టి మహేష్ బాబు తదుపరి సినిమా వచ్చే ఏడాది మే తరువాతనే ప్రారంభం అవుతుందని తెలుస్తోంది…..!!