మహేష్ ఫ్రెండ్ షిప్ సాంగ్ వచ్చేసింది.. మహర్షి ఫస్ట్ సింగిల్ ఇదే..!

-

సూపర్ స్టార్ మహేష్ వంశీ పైడిపల్లి డైరక్షన్ లో చేస్తున్న ప్రెస్టిజియస్ మూవీ మహర్షి. పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ కూడా స్పెషల్ రోల్ చేస్తున్నాడు. మహేష్, నరేష్ స్నేహితులుగా కనిపిస్తున్న ఈ మహర్షి నుండి మొదటి సాంగ్ రిలీజ్ అయ్యింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా నుండి మొదటి సాంగ్ చోటి చోటి బాతె సాంగ్ వచ్చింది.

శ్రీమణి లిరిక్స్ అందించిన ఈ సాంగ్ ను దేవి శ్రీ పాడినట్టు తెలుస్తుంది. మహేష్, నరేష్, పూజా ముగ్గురు స్నేహితులుగా ఈ పాటలో కనిపిస్తున్నారు. సినిమాలో మహేష్ డిఫరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు. స్టూడెంట్ గా.. కంపెనీ సీ.ఈ.వోగా మహేష్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్ర చేస్తున్నాడు. మే 9న మహర్షి రిలీజ్ అవుతుంది. మరి వంశీ పైడిపల్లి మహేష్ కు ఎలాంటి హిట్ ఇస్తాడో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news