మిస్టీరియస్ గుహలు, మిస్టీరియస్ ఇళ్లు.. ఇలా ఎన్నో రకాల మిస్టరీలకు నిలయం సముద్రం. మరి.. ఆ మిస్టరీలేంటో మనం చూసోద్దాం పదండి
సముద్రం ఎన్నో జీవరాశులకు నిలయం. సముద్రం మీద ఆదారపడి ఎన్నో జీవులు బతుకుతుంటాయి. సముద్రం ఓ ఇల్లులాంటిది. అయితే… సముద్రం లోపల సహజ సిద్ధంగా ఎన్నో అద్భుతాలు ఏర్పడుతుంటాయి. కొన్ని ప్రకృతి ప్రసాదించినవి కాగా.. మరికొన్ని మనుషులు సృష్టించినవే. అయితే.. సముద్రంలోపల అడుగు భాగంలో కొన్ని కిలోమీటర్ల కింద ఉండే విగ్రహాలను మీరు చూశారా? అవి కూడా మిస్టీరియస్ విగ్రహాలు.. అవి అక్కడ ఎందుకు ఉన్నాయో.. వాటి ఇతివృత్తం ఏందో మాత్రం ఎవ్వరికీ తెలియదు. కానీ.. అవి మాత్రం టూరిస్టులను తెగ ఆకర్షిస్తున్నాయి. టూరిస్టులు సముద్రం లోపల ఉండే ఆ విగ్రహాలను చూడటానికి పోటీ పడుతున్నారు.
ఎంత డేంజరైనా.. ఆక్సీజన్ పెట్టుకొని మరీ సముద్రంలోపలికి వెళ్లి ఆ విగ్రహాలను దర్శించుకుంటున్నారు. దీనివల్ల సముద్రంలోపలికి వెళ్లామన్న సంతృప్తి… మిస్టీరియస్ విగ్రహాలను చూశామన్న సంతోషం రెండూ దక్కుతాయని కాబోలు. ఇలా మిస్టీరియస్ గా ఉన్న విగ్రహాలు ఒకటి రెండు కాదు.. పదుల సంఖ్యలో ఉన్నాయి. అంతేనా మిస్టీరియస్ గుహలు, మిస్టీరియస్ ఇళ్లు.. ఇలా ఎన్నో రకాల మిస్టరీలకు నిలయం సముద్రం. మరి.. ఆ మిస్టరీలేంటో మనం చూసోద్దాం పదండి…