ఇతర హీరోలు కల్లో కూడా ఊహించలేని రికార్డ్ కొట్టిన మహేశ్ !

485

సూపర్ స్టార్ మహేష్ బాబు వరుసగా భరత్ అనే నేను, మహర్షి ఇలాంటి రెండు సూపర్ డూపర్ హిట్లు కొట్టిన తర్వాత సంక్రాంతి పండుగకు రిలీజ్ చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో హ్యాట్రిక్ విజయం తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో అదిరిపోయే మాస్ పెర్ఫార్మెన్స్ అదేవిధంగా ఎన్నడూ చేయని విధంగా డాన్స్ స్టెప్పులు వేయడంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సంక్రాంతి పండుగకు రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.

Image result for sarileru neekevvaru

సినిమా రిలీజ్ అయ్యి మొదటి షో నుండి పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్ల విషయంలో మహేష్ సరికొత్త రికార్డులు టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర నెలకొల్పాడు. ఇటువంటి తరుణంలో ఏ ఇతర హీరోలు సాధించలేని ఊహించలేని రికార్డ్ టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర క్రియేట్ చేశాడు మహేష్. మేటర్ లోకి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాలలో 68.22 కోట్ల షేర్ రాబట్టి వంద కోట్ల వైపు పరుగులు పెడుతున్న ఈ సినిమా ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసేసింది.

 

ఈ చిత్రంతో మహేష్ నైజాంలో ఓ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. నాలుగు సార్లు 20కోట్లకు పైగా షేర్ సాధించిన హీరోగా తన పేరు నమోదు చేస్తుకున్నారు.గతంలో మహేష్ నటించిన శ్రీమంతుడు, భరత్ అనే నేను, మహర్షి సినిమాలు నైజాంలో 20 కోట్లకు పైగా షేర్లు సాధించాయి.ఇక తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు ఐదు రోజులకే నైజాంలో 22.5 కోట్ల షేర్ రాబట్టింది. దీంతో నాలుగు సార్లు నైజాంలో 20కోట్లకు పైగా షేర్ వసూలు చేసి అరుదైన రికార్డ్ ని మహేష్ తన ఖాతాలో వేసుకున్నాడు.