Mahesh Babu: చిన్నారుల పాలిట దేవుడు మహేశ్ బాబు..ఒకే రోజులో 30 మందికి గుండె ఆపరేషన్

-

టాలీవుడ్ సూపర్ స్టార్ నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘మహర్షి’. ఇందులో ఓ పాటలో ‘మనుష్యులందు నీ కథా.. ‘మహర్షి’లాగ సాగదా..’ అనే చరణాలు ఉంటాయి. ఆ చరణాలు రియల్ లైఫ్ లో మహేశ్ బాబుకు వర్తిస్తాయని చెప్పొచ్చు. చిన్నారులకు సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు మహేశ్. ఈ సందర్భంగానే ఆయన రియల్ సూపర్ స్టార్ అని మహేశ్-కృష్ణ అభిమానులు చెప్తుంటారు.

హార్ట్ సంబంధిత ఇష్యూస్ తో బాధపడుతున్న చిన్నారులు ఎవరున్నా, ఎక్కడున్నా.. మహేశ్ బాబు టీమ్ ను సంప్రదిస్తే కనుక వారికి కావల్సిన ట్రీట్ మెంట్ అందిస్తారు మహేశ్. ఆంధ్రా హాస్పిటల్ తో కలిసి మహేశ్ ఈ కార్యక్రమం చేస్తున్నారు. ఇలా మహేశ్ ఇప్పటి వరకు 1,000 మందికి పైగా చిన్నారులకు గుండె సంబంధిత సమస్యలకు చికిత్స చేయించారు. ఇటీవల టాలీవుడ్ సూపర్ స్టార్ తన పేరిట ‘మహేశ్ బాబు ఫౌండేషన్’ స్టార్ట్ చేశారు.

‘మహేశ్ బాబు ఫౌండేషన్’ బాధ్యతలను మహేశ్ సతీమణి నమ్రత చూసకుంటుంది. తాజాగా ఆమె చిన్నారుల గుండె సంబంధిత ఆపరేషన్స్ గురించి ఓ ఫొటో షేర్ చేసింది. సదరు ఫొటోకు ఆమె ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ ఇచ్చింది. ఒకే రోజులో 30 మంది చిన్నారుల గుండె ఆపరేషన్ చేయించినట్లుగా తెలిపింది. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఈ ఆపరేషన్స్ చేయించినట్లు పేర్కొంది.

ఈ కార్యక్రమాన్ని ఏపీ గవర్నర్ విశ్వ భూషణ్ హరిచందన్ చేతుల మీదుగా ప్రారంభించినట్లు వివరించింది. ఇందులో భాగస్వామ్యం అయిన ఆంధ్రా హాస్పిటల్ కు థాంక్స్ చెప్పింది. ఈ విషయం తెలుసుకుని మహేశ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మహేశ్ రియల్లీ గ్రేట్ అని కామెంట్స్ చేస్తున్నారు. తమ హీరో ఇంత చక్కటి పని చేశారని గర్వంగా ఫీలవుతున్నారు. మహేశ్ బాటు నటించిన ‘సర్కారు వారి పాట’ ఫిల్మ్ వచ్చే నెల 12న విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news