నయనతార దెబ్బకు షాక్ లో మాళవిక మోహన్.. అసలేమైందంటే..?

-

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. తెలుగు తోపాటు తమిళంలో కూడా ఎన్నో సినిమాలను నటించి ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. కోలీవుడ్ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈమె సరోగసి ద్వారా ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది. ఇకపోతే నయనతార తాజాగా నటించిన చిత్రం కనెక్ట్. ఈ సినిమా నిన్న విడుదలైన విషయం తెలిసిందే. ఇకపోతే నయనతార ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తనపై ఒక హీరోయిన్ గతంలో చేసిన విమర్శలకు స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది.

ఈ సందర్భంగా నయనతార మాట్లాడుతూ.. నేను సినిమాకు అనుగుణంగా ఏది చెబితే అది చేస్తాను.. డ్రెస్సింగ్.. మేకప్ వాళ్ళు చెప్పిన విధంగానే అనుసరిస్తాను. కానీ గతంలో ఒక ఇంటర్వ్యూ చూశాను.. అందులో ఒక హీరోయిన్ నా మేకప్ గురించి కామెంట్లు చేసింది. ఆమె పేరు ఇప్పుడు చెప్పాలనుకోవడం లేదు.. హాస్పిటల్స్ లో నేను మేకప్ లిఫ్టిక్ చక్కగా వేసుకోవడాన్ని ఆమె తప్పు పట్టింది. కానీ నేను చెప్పేది ఒకటే సినిమాల విషయంలో చిన్న వ్యత్యాసం ఉంటుంది కమర్షియల్ రియలిస్టిక్ సినిమాలు ఉంటాయి రియలిస్టిక్ చిత్రంలో లుక్స్ పరంగా జాగ్రత్తలు పాటించాలి.

కమర్షియల్ సినిమాలో దర్శకుడు హీరోయిన్స్ ను ఇలాగే స్టైలిష్ గా చూపిస్తారు అని చెప్పుకొచ్చింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఆ వీడియోని చూసిన నెటిజన్స్.. నయనతార అదంతా నటి మాళవిక మోహన్ గురించే కామెంట్లు చేసింది అంటూ వార్తలు అవుతున్నాయి. ఎందుకంటే గతంలో ఒక ఇంటర్వ్యూలో ఆమె నయనతారను తప్పు పట్టింది.. అయితే అప్పుడు ఆమె నయనతార పేరు చెప్పలేదు. ఇప్పుడు నయనతార మాళవిక పేరు చెప్పకుండా కౌంటర్ ఇచ్చింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version