చంద్రబాబు, రేవంత్ రెడ్డి ఇద్దరు నాకు న్యాయం చేయాలి – మంచు మనోజ్

-

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు కుటుంబానికి సంబంధించిన గొడవ హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. కుటుంబంలోనే ఒకరి పైన ఒకరు కేసులు పెట్టుకుంటున్నారు. తండ్రి అలాగే కొడుకుల మధ్య ఆస్తి తగాదాలు తెరపైకి వచ్చాయి. దీంతో కుటుంబ సమస్య కాస్త రోడ్డు పైకి వచ్చింది.


అంతేకాదు హీరో మంచు మనోజ్ తండ్రి చేతిలో దెబ్బలు తిని ఆసుపత్రి పాలు కూడా అయ్యాడు. ఈ తరుణంలోనే మోహన్ బాబు పై మంచు మనోజ్ కేసు పెట్టడం జరిగింది. దానికి కౌంటర్ గా మంచు మనోజ్ తో పాటు భూమా మౌనిక పైన కూడా మోహన్ బాబు కేసు పెట్టారు. ఈ తరుణంలోనే హీరో మంచు మనోజ్ సంచలన పోస్ట్ పెట్టాడు.

తన కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే న్యాయం చేయాలని సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. తనపై అన్యాయంగా మోహన్ బాబు వ్యవహరిస్తున్నారని… ఇలాంటి నేపథ్యంలో.. విచారణ చేసి తనకు న్యాయం చేయాలని రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ పోస్ట్ పెట్టాడు మంచు మోహన్ బాబు చిన్న కొడుకు మనోజ్. దీంతో మంచు మనోజ్ చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

https://x.com/HeroManoj1/status/1866180910472974706

Read more RELATED
Recommended to you

Exit mobile version