అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. పంట కాలువలోకి దూసుకెళ్లింది ఓ కారు. ఈ సంఘటన ఇవాళ ఉదయం వెలుగులోకి వచ్చింది. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం వివరాలు ఇలా ఉన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా… పి గన్నవరం మండలం ఉడిముడి వద్ద కారు ఘోర ప్రమాదానికి గురైంది. కాలువలోకి దూసుకు వెళ్లింది కారు. ఇక ఈ కారు ప్రమాదం జరిగినప్పుడు….కారులో నలుగురు కుటుంబ సభ్యులు ప్రయాణిస్తున్నారు.
ఈ తరుణంలోనే… భార్య, ఇద్దరు పిల్లలు గల్లంతు అయ్యాయి. భర్త మాత్రం ఒడ్డుకు చేరుకున్నాడు. అరకు నుంచి పోతవరం సొంత గ్రామానికి వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. తెల్లవారుజామున మూడు గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు… ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గల్లంతు అయిన ముగ్గురు మరణించే అవకాశాలు ఉన్నాయని గ్రామాస్తులు అంటున్నారు.