నాలుగోసారి తండ్రి కాబోతున్న మంచు విష్ణు..!

-

మంచు మోహన్ బాబు తనయుడు సిని హీరో మంచు విష్ణు నాలుగోసారి తండ్రి కాబోతున్నాడు. విష్ణు, విరానికాలకు నాలుగో సంతానం అందనుంది. ఇప్పటికే రెండు కాన్పులలో ముగ్గురు బిడ్డలకు జన్మనిచ్చారు విష్ణు, విరానిక. మొదటిసారి కవలలు పుట్టగా వారికి అరియానా విరియానా అని పేర్లు పెట్టారు. రెండవ సారి పుట్టిన వారసుడికి అవరం అని పేరు పెట్టారు.

లేటెస్ట్ గా మంచు విష్ణు తను మళ్లీ తండ్రి కాబోతున్న విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెళ్లడించాడు. ప్రస్తుతం మంచు విష్ణు, విరానికాలు న్యూ యార్క్ లో ఉన్నారని తెలుస్తుంది. కెరియర్ పరంగా వెనుకపడ్డ మంచు విష్ణు ఈమధ్యనే ఓటర్ టీజర్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఎలక్షన్ కోడ్ ఉండటంతో సినిమా రిలీజ్ ఆపేశారు. అంతేకాదు త్వరలోనే శ్రీను వైట్లతో మరో సినిమా చేస్తున్నాడట. ఢీ సీక్వల్ గా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version