Breaking News : కన్నప్ప షూటింగ్ లో మంచు విష్ణుకు ప్రమాదం

-

మంచు విష్ణు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరమే లేదు. ప్రస్తుతం మంచు విష్ణు తన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప సినిమాలో నటిస్తున్నాడు. అవా ఎంటర్టైన్ మెంట్ అండ్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై దాదాపు 150 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. బాలీవుడ్ టెలివిజన్ రంగంలో సూపర్ హిట్ మహాభారత సిరీస్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ సింగ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించబోతున్నాడు. ఈ సినిమాలో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ తేడా లేకుండా స్టార్ హీరోలను, నటులను దింపేశాడు.

ఈ సినిమాలో ప్రభాస్, అనుష్క, మోహన్ లాల్, శివన్న వంటి స్టార్స్ నటిస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ ప్రస్తుతం న్యూజిలాండ్ లో జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సెట్ లో ప్రమాదం చోటు చేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రమాదంలో మంచు విష్ణు గాయాల పాలైనట్టు తెలుస్తోంది. కన్నప్ప షూటింగ్ లో ఉండగా.. డ్రోన్ కెమెరా అదుపు తప్పి విష్ణు మీదకి దూసుకురావడంతో చేతికి పలు గాయాలు అయినట్టు సమాచారం. విష్ణును సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం. చిన్న గాయాలే అయినప్పటికీ వైద్యులు విష్ణును రెస్ట్ తీసుకోవాలని సూచించారట. దీంతో షూటింగ్ ని చిత్ర బృందం షూటింగ్ వాయిదా వేశారు. విష్ణు త్వరగా కోలుకోవాలని అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news