తుంగతుర్తిని చూస్తే తృప్తి గా ఉంది : కేసీఆర్

-

తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడ గోడలపై రాతలు కనిపించేది. తుంగతుర్తిని చూస్తేనే ఇక్కడ తృప్తి కలుగుతుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఇప్పుడు చెరువులు అన్ని నిండుగా ఉన్నాయి. ఉద్యమ సమయంలో తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని ఏ ఊరికి వెళ్లినా చుక్క నీళ్లు ఉండేవి కాదు అన్నారు. దేవాదుల నీళ్లు రావాల్సి ఉంది.. ఆ పనులు జరుగుతున్నాయి. తుంగతుర్తి నియోజకవర్గానికి బస్వాపూర్ ప్రాజెక్ట్ నుంచి నీళ్లు రాబోతున్నాయి. కేసీఆర్ చచ్చుడో.. తెలంగాణ వచ్చుడో అని ఉద్యమం చేస్తేనే తెలంగాణ వచ్చింది. తెలంగాణ ఉద్యమం సమయంలో చెరుకు సుధాకర్ ను కూడా జైలులో వేశారని తెలిపారు కేసీఆర్.

సంక్షేమానికి సంబంధించి పెన్షన్, కళ్యాణలక్ష్మీ పథకాలను ప్రారంభించారు. ఆ తరువాత వాటిని మెల్లగా పెంచుకున్నాం. రైతుల గురించి ఇబ్బందులుండేవి. కరెంట్ కోతలుండేవి. వాటన్నింటిని అధిగమించి ఇవాళ రైతు ఇబ్బందులు లేకుండా దేశంలోనే మొట్టమొదటి పథకం రైతు బంధు పథకం ప్రవేశపెట్టామని తెలిపారు. తలసరి విద్యుత్ వినియోగం ఉన్న రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తలసరి ఆధాయం దేశానికే తలమానికం కావడం.. పెద్ద పెద్ద రాష్ట్రాలను మించి ఉండటం గర్వకారణం అన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news