మా మధ్య గొడవలు సాధారణమే..భూతద్దంలో చూడవద్దు – మంచు విష్ణు

 

హీరోలు, అన్నదమ్ములు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విభేదాలు బయటపడ్డాయి. అన్న విష్ణు ఇళ్లలోకి చొరబడి తన వాళ్లను, బంధువుల్ని ఇలా కొడుతుంటాడని, ఇది సిచ్యుయేషన్ అంటూ మనోజ్ సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేశారు. వీడియోలో విష్ణు ఎవరిపై దూసుకెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు ఆయనను అదుపు చేస్తున్నట్లు ఉంది.

కాగా మనోజ్ పెళ్లి సమయం నుంచి అన్నదమ్ముల మధ్య విభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే.. ఈ వివాదం పై కాసేపటి క్రితమే.. మంచు విష్ణు స్పందించారు. మా మధ్య సాధారణంగా జరిగేదేనంటూ మంచు విష్ణు పేర్కొన్నారు. మా మధ్య గొడవలు సాధారణ మే..భూతద్దంలో చూడవద్దని కోరారు మంచు విష్ణు. చాలా చిన్న విషయం..దీన్ని భూతద్దంలో చూడ వద్దని కోరారు మంచు విష్ణు. ఇక అటు మంచు లక్ష్మీ ఈ వివాదంపై అసలు స్పందించకుండానే వెళ్లి పోయారు. అటు ఈ సంఘటనపై మంచు మోహన్ బాబు సీరియస్ అయ్యారట.