బాడీ షేమింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన మంజిమా..!!

ఇటీవల కాలంలో హీరోయిన్లు ఒకవైపు క్యాస్టింగ్ కౌచ్ బారిన పడుతుంటే మరి కొంతమంది హీరోయిన్లు బాడీ షేమింగ్ బారిన పడుతున్నారు. అంతేకాదు వారు ఎంత అందంగా ఉండడానికి ప్రయత్నం చేసినప్పటికీ ఇలా బాడీ షేమింగ్ గురించి విమర్శలు వస్తూనే ఉంటాయి. ముఖ్యంగా ఇటీవల కాలంలో సోషల్ మీడియా వచ్చిన తర్వాత బాడీ షేమింగ్ చేసే వాళ్ళ సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందని చెప్పవచ్చు. ఈ క్రమంలోని గౌతమ్ కార్తీక్ , మంజిమా మోహన్ వివాహం చేసుకోగా.. ప్రస్తుతం మంజిమా గురించి సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్స్ వస్తున్నాయి.

ఇటీవల తనపై వస్తున్న ట్రోల్స్ గురించి స్పందించిన మంజిమా.. షాకింగ్ కామెంట్లు చేసింది. ఇలాంటివి.. పర్సనల్ లైఫ్ పై ఏ విధంగా ప్రభావం చూపవని ఆమె తెలిపింది. అవసరం అనుకుంటే బరువు తగ్గడానికి కూడా సిద్ధమేనని తెలిపింది మంజిమా.. ఆమె మాట్లాడుతూ.. మా మ్యారేజ్ జరిగిన సమయంలో కూడా చాలామంది నా బరువు గురించి నెగటివ్ కామెంట్లు చేశారు.. ట్రోల్స్ నాకు కొత్త కాదని, గతంలో కూడా తనపై చాలా ట్రోల్స్ వచ్చాయి అని ఆమె తెలిపింది. ప్రస్తుతం నా శరీరంతో నేను సౌకర్యవంతంగా ఉన్నాను. నేను కోరుకున్న సమయంలోనే నేను బరువు తగ్గుతాను. ఎవరి కోసమో నేను బరువు తగ్గాల్సిన అవసరం లేదు. ఎంత ట్రోల్ చేసినా నేను పట్టించుకోను అంటూ ట్రోలర్స్ కి గట్టి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేసింది.

ప్రస్తుతం తన బాడీ షేమింగ్ పై వస్తున్న వార్తలను పట్టించుకోవడం లేదు అని స్పష్టం చేసింది.. అంతేకాదు వృత్తిపరమైన నిబద్ధతతో బరువు తగ్గాలని భావించిన సమయంలో తప్పకుండా బరువు తగ్గుతాను.. అప్పుడు నాకు పెద్దగా కష్టం అనిపించదు. నేను లావుగా ఉన్నంత మాత్రాన ఇతరులకు సమస్య ఏంటో నాకు అర్థం కావడం లేదు అంటూ ఆమె తెలిపింది. ప్రస్తుతం ఈమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.