BREAKING : తెలంగాణలో 3,897 కొత్త పోస్టుల భర్తీకి అనుమతి

-

తెలంగాణ ప్రభుత్వం వైద్యరోగ్యశాఖలో భారీగా పోస్టుల భర్తీ చేపట్టనుంది. రాష్ట్రంలోని మెడికల్ కాలేజీల్లో 3,897 కొత్త పోస్టుల భర్తీకి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని 9 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, వాటి అనుబంధ ఆస్పత్రుల్లో ఈ కొత్త పోస్టులను భర్తీ చేయనున్నారు.

అటు 16, 940 ఉద్యోగాలను సర్కారు తీసుకు రావడం జరిగింది. టీఎస్పీఎస్సీ ఛైర్మన్‌తో కలిసి సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడారు. 60 వేల 929 పోస్టులని ఇప్పటికే అనుమతి ఇచ్చారు. ఇప్పుడు మరో 16 వేల 940 పోస్టులకు అనుమతి ఇచ్చేలా వున్నారు.

అలానే ఖాళీగా ఉన్న 80 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సర్కార్ చూస్తోంది. ఉద్యోగాలని ఇచ్చేనందుకే 16,614 పోలీసు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ని విడుదల చేసింది. అలానే ప్రిలిమినరీ పరీక్షలను కూడా నిర్వహించింది.

Read more RELATED
Recommended to you

Latest news