KCR అంటే ‘ఖాసీం చంద్రశేఖర్ రజ్వి’: బండి సంజయ్

-

తెలంగాణలో పేదల రాజ్యం కోసమే ‘ప్రజా సంగ్రామ యాత్ర’ అని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తెలిపారు. టిఆర్ఎస్ పాలన రజాకారుల పాలనను తలపిస్తోందని, కేసీఆర్ అంటే ‘ఖాసీం చంద్రశేఖర్ రజ్వి’ అని అన్నారు.

ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని జైళ్లలో వేస్తున్నారని, ఎన్నికలు వస్తేనే టిఆర్ఎస్ నేతలు బయటకు వస్తారని విమర్శించారు. ముంపు గ్రామాలను కేసీఆర్ పట్టించుకోలేదని, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గత ఎన్నికల్లో కేసీఆర్ ఇచ్చిన హామీలేవీ అమలు కాలేదు. రుణమాఫీ, డబుల్ బెడ్రూం, నిరుద్యోగ భ్రుతి, దళిత, గిరిజనులకు 3 ఎకరాలుసహా ఎన్నో హామీలిచ్చి అమలు చేయలేదు. ఎన్నికల గడువు దగ్గర పడుతుండటంతో మళ్లీ కేసీఆర్ కొత్త డ్రామాలకు తెరదీశారన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news