మ‌న్మ‌థుడు 2 క‌లెక్ష‌న్స్‌… డిజాస్ట‌ర్‌కు మించి

1256

ఇప్ప‌టికే మ‌న్మ‌థుడు 2 సినిమాకు జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగిపోయింది.. ఘోర‌మైన ప్లాప్ టాక్ బాగా స్ప్రెడ్ అవ్వ‌డంతో నాగార్జున ఈ సినిమాకు ఎన్ని జాకీలు పెట్టి లేపుదామ‌ని చూస్తున్నా ఎవ్వ‌రు ప‌ట్టించుకునే ప‌రిస్థితి లేదు. క‌నీసం నాగార్జున ఫ్యాన్స్ సంఘాలు, అక్కినేని అభిమానులు కూడా ఈ సినిమా ఆడుతున్న థియేట‌ర్ల వైపు చూడ‌డం లేదు.

తొలి ఆట‌కే డిజాస్టర్ టాక్ వచ్చేయడంతో, ఆ ప్రభావం వసూళ్లపై పడింది. ఈ సినిమా వసూళ్ళు షో… షోకు దారుణంగా ప‌డిపోతున్నాయి. అటు శ‌నివారం వ‌చ్చిన బ‌ర్నింగ్‌స్టార్ సంపూర్ణేష్‌బాబు కొబ్బ‌రిమ‌ట్ట రెండు రోజుల‌కే బ్రేక్ ఈవెన్‌కు చేరుకుని లాభాల భాట ప‌ట్టేస్తే రూ.24 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ చేసిన మ‌న్మ‌థుడు 2 మూడు రోజుల‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా రూ.8 కోట్లు వ‌సూలు చేసేందుకు ఆప‌సోపాలు ప‌డింది.

ఇక ఫ‌స్ట్ వీకెండ్ కంప్లీట్ అయ్యిందో లేదో సోమ‌వారం నుంచే కొన్ని మ‌ల్టీఫ్లెక్స్‌ల‌లో షోలు త‌గ్గించేస్తుంటే.. మ‌రికొన్ని చోట్ల సినిమాను లేపేసి కొబ్బ‌రిమ‌ట్ట‌, రాక్ష‌సుడు సినిమాలు వేస్తున్నారు. చివరికి ఆదివారం కూడా ఆక్యుపెన్సీ లేకపోవడం మన్మథుడు-2ను నీరుగార్చింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్‌కు రావాలంటే ఇంకా రూ.16 కోట్లు రాబ‌ట్టాలి. ఓవ‌రాల్‌గా ఈ సినిమాకు 50 శాతానికి పైగా న‌ష్టాలు త‌ప్పేలా లేవు.

ఏరియాల వారీగా మ‌న్మ‌థుడు 2 … 3 రోజుల వ‌సూళ్లు ఇలా ఉన్నాయి…

నైజాం – 2.10 కోట్లు

సీడెడ్ – 0.81 కోట్లు

ఉత్తరాంధ్ర – 0.84 కోట్లు

ఈస్ట్ – 0.41 కోట్లు

వెస్ట్ – 0.43 కోట్లు

గుంటూరు – 0.80 కోట్లు

కృష్ణా – 0.52 కోట్లు

నెల్లూరు – 0.25 కోట్లు