వెనక్కి తగ్గిన నాగబాబు…నా ట్వీట్ డిలీట్ చేశానంటూ పోస్ట్‌ !

-

అల్లు అర్జున్‌ విషయంలో నాగబాబు… వెనక్కి తగ్గినట్లు కనిపిస్తున్నారు. నా ట్వీట్ డిలీట్ చేశానంటూ పోస్ట్‌ పెట్టారు నాగబాబు. మెగా బ్రదర్ నాగబాబు… మొన్న ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సంచలన పోస్ట్ పెట్టారు. అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి ప్రచారం చేయడాన్ని వ్యతిరేకిస్తూ… ఇన్ డైరెక్ట్ గా… వివాదాస్పద పోస్టు పెట్టి హల్చల్ చేశారు నాగబాబు.

Mega Brother Naga Babu’s cryptic attack on Icon Star Allu Arjun

తమతో ఉన్నవాళ్లు తమకు వెన్నుపోటు పొడిచేలా వ్యవహరిస్తున్నారని… అలాంటి వాళ్లు మా వాళ్లు కాదంటూ ఇన్డైరెక్టుగా అల్లు అర్జున్ బహిరంగంగానే తిట్టారు నాగబాబు. అయితే ఈ పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. అయితే తాజాగా నాగబాబు ఈ విషయంలో వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. గతంలో చేసిన పోస్టు డిలీట్ చేసి… తన ట్వీట్ డిలీట్ చేశాను అంటూ వెల్లడించాడు. అయితే నాగబాబు చేసిన తాజా పోస్ట్ పై… అల్లు అర్జున్ ఫ్యాన్స్ సెటైర్లు పేల్చుతున్నారు. అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు భయపడి నాగబాబు దిగి వచ్చాడని కామెంట్ చేస్తున్నారు.

http:/https://x.com/NagaBabuOffl/status/1791709323577401535

Read more RELATED
Recommended to you

Latest news