ప్చ్.. పాపం నిహారికకు మళ్లీ నిరశే మిగిలింది..!

మెగా డాటర్ నిహారిక హీరోయిన్ గా టైటిల్ రో పోశిస్తూ వచ్చిన సినిమా సూర్యకాంతం. ప్రణీత్ బ్రహ్మాండపల్లి డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రాహుల్ విజయ్, నిహారిక, పెర్లీన్ నటించారు. డేటింగ్ అండ్ డ్యాషింగ్ ఉమన్ గా నిహారిక నటించగా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో లేదు అన్న టాక్ వచ్చింది. డైర్కటర్ టేకింగ్ బాగున్నా కథ, కథనాలు పెద్దగా ఆకట్టుకోలేదని అంటున్నారు.

నిహారిక క్యారక్టరైజేషన్ కూడా కన్ ఫ్యూజ్ చేసింది. ఫస్ట్ హాఫ్ మొత్తం సరదాగా అనిపించినా సెకండ్ హాఫ్ స్క్రీన్ ప్లే మెప్పించలేదని తెలుస్తుంది. ఒక మనసు, హ్యాపీ వెడ్డింగ్ సినిమాల్లో సైలెంట్ రోల్స్ చేసిన నిహారిక సూర్యకాంతంలో మాత్రం అల్లరి పిల్లగా ఆకట్టుకుంది. అయితే సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నా నిహారికకు సూర్యకాంతం కూడా నిరాశ మిగిల్చింది. ముద్దపప్పు ఆవకాయ్ వెబ్ సీరీస్ తో సత్తా చాటిన ప్రణీత్ ఫీచర్ ఫిల్మ్ గా చేసిన సూర్యకాంతం మాత్రం మెప్పించలేకపోయింది.