మెగా ఫ్యామిలీ నుండి ఈమధ్యనే హీరోగా ఎంట్రీ ఇచ్చాడు మెగాస్టార్ చిరంజీవి చిన్నళ్లుడు కళ్యాణ్ దేవ్. మొదటి సినిమా విజేత అంతగా ఆకట్టుకోలేదు. అయినా సరే మరో ప్రయత్నం చేస్తున్నాడు కళ్యాణ్ దేవ్. లుక్ వైజ్ కుర్రాడు పర్వాలేదు అనేలా ఉన్నా నటనలో ఇంకా పరిణితి సాధించాల్సి ఉంది. విజేతలో కళ్యాణ్ నటన వల్ల ప్రేక్షకులు కాస్త ఇబ్బంది పడ్డారు. అయితే అతను నటించాలన్న తపన చూసి మెచ్చుకున్నారు.
ఇదిలాఉంటే కళ్యాణ్ దేవ్ రెండవ సినిమా పులి వాసు డైరక్షన్ లో తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా మొదట మెహ్రీన్ కౌర్ ను అనుకున్నారట. 30 లక్షల రెమ్యునరేషన్ తో మెహ్రీన్ కూడా సినిమాకు ఓకే చెప్పిందట. తీరా సెట్స్ మీదకు వెళ్లే ఈ టైంలో సినిమా చేయనని చెప్పిందట. అలా ఎందుకు అంటే ఈ సినిమాలో హీరోగా ముందు సుధీర్ బాబు నటుస్తున్నాడని తెలిసి మెహ్రీ ఓకే చెప్పిందట. కాని సుధీర్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వెళ్లాడు.
అందుకే మెహ్రీన్ కూడా ఈ సినిమాపై ఆశలు వదులుకుందట. కళ్యాణ్ దేవ్ తో చేస్తే తన ఇమేజ్ డ్యామేజ్ అవుతుందని భావిస్తున్నట్లు తెలుస్తుంది. మరి కళ్యాణ్ దేవ్ కు హీరోయిన్ గా ఎవరు ఫైనల్ అవుతారో చూడాలి.