తాగి అడ్డంగా బుక్కైన హీరోయిన్

-

డ్రంక్ అండ్ డ్రైవ్ లో సెలబ్రిటీస్ దొరకడం కొత్తేమి కాదు. అయితే ఎప్పుడు హీరోలు, డైరక్టర్స్ లాంటి వారు పోలీసులకు చిక్కేవారు. లేటెస్ట్ గా ఓ హీరోయిన్ డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడటం షాకింగ్ గా మారింది. తెలుగు, తమిళ భాషల్లో నటిస్తున్న గాయత్రి రఘురాం చెన్నై పోలీసులకు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో బుక్ అయ్యింది.

చెన్నైలోని ఎం.ఆర్.సి నగర్ లో ఓ లేట్ నైట్ పార్టీకి వెళ్లొస్తున్న గాయత్రి అభిరామపురం చెక్ పాయింట్ వద్ద పోలీసులు చేసిన డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ లో అడ్డంగా దొరికిపోయింది. బ్రీత్ ఎనలైజర్ లో ఆమె ఊదినప్పుడు బిఏసి 185 పాయింట్లు రావడం ఆశ్చర్యకరం. మోతాదుకి మించి మద్యం సేవించిందని గుర్తించిన పోలీసులు ఆమె వాహనం ఆదీనంలోకి తీసుకున్నారు.

అయితే అప్పటికే అర్ధరాత్రి కావడంతో ఆమె ఓ సెలబ్రిటీ అని గుర్తించిన జనాలు ఆమెని చుట్టుముట్టారట. అయితే మళ్లీ పోలీసుల సాయంతో తన ఇంటికి చేరిందట. గాయత్రి రఘురాం కారుని.. డాక్యుమెంట్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏ మొబైల్ కోర్ట్ లో అయినా 3500 రూపాయలు చెల్లించి ఆమె డాక్యుమెంట్స్ తీసుకుని వెళ్లొచ్చని చెప్పారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version