ఆగస్టులో వారానికో మెగా హీరో సినిమా రిలీజ్!

-

వర్షాకాలంలో సినిమా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి ఆగస్టులో పలు ఇంట్రెస్టింగ్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఈ నెలలో ప్రతి వారానికి ఓ మెగా హీరో సినిమా రిలీజ్ అవుతోంది. ఈ నెల మెగా ఫ్యాన్స్ కు పండగే. మరి ఆగస్టులో విడుదలయ్యే ఆ సినిమాలేంటి? ఏ వారం ఏ చిత్రాలు వస్తున్నాయో ఓసారి చూసేద్దామా..

అగ్ర కథానాయకుడు చిరంజీవి మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న ‘భోళా శంకర్‌’. ఆగస్టు 11న ఈ సినిమా విడుదల కానుంది. తమన్నా కథానాయిక. కీర్తిసురేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆగస్టు మూడో వారంలో 18న నాలుగు సినిమాలు విడుదలవుతున్నాయి. వైష్ణవ్‌తేజ్‌ హీరోగా రూపొందిన ‘ఆదికేశవ’, శ్రీకాంత్‌ అడ్డాల దర్శకత్వం వహించిన ‘పెదకాపు 1’, సొహైల్‌ హీరోగా నటించిన ‘మిస్టర్‌ ప్రెగ్నెంట్‌’, ‘నచ్చినవాడు’ విడుదలవుతున్నాయి. వరుణ్‌ తేజ్‌ కథానాయకుడిగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘గాంఢీవధారి అర్జున’ . సాక్షి వైద్య కథానాయికగా నటించగా ప్రవీణ్‌ సత్తారు దర్శకత్వం వహించారు. యాక్షన్‌, స్పై ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఆగస్టు 25న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news